Earthquake: ఇండోనేషియాలో 7.6 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ అలలు

  • ఇండోనేషియాలో 7.6 తీవ్రతతో భారీ భూకంపం
  • సునామీ అలలు.. ఒకరు మృతి
  • భయంతో ప్రజలు పరుగులు
Earthquake

Earthquake

ఇండోనేషియాను భారీ భూకంపం హడలెత్తించింది. 7.6 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీంతో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. అంతేకాకుండా సునామీ అలులు కారణంగా ఒకరు చనిపోయారు. పలువురికి గాయాలయ్యాయి. భూకంపం కారణంగా ప్రజలు భయాందోళనతో ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు.

స్థానిక కాలమానం ప్రకారం.. సుమారు ఉదయం 7:48 గంటలకు సంభవించింది. భూకంపం కేంద్రం టెర్నాటే నగరానికి వాయువ్యంగా సుమారు 127 కిలోమీటర్ల (79 మైళ్ల) దూరంలో ఏర్పడింది. అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.