NTV Telugu Site icon

క‌రోనా ఎఫెక్ట్‌.. మ‌రోసారి హ‌జ్ యాత్ర ర‌ద్దు

Haj

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా మ‌రోసారి హ‌జ్ యాత్ర ర‌ద్దు చేశారు.. కోవిడ్ ఫ‌స్ట్ వేవ్ స‌మ‌యంలో.. గ‌త ఏడాది హ‌జ్‌యాత్ర‌ను ర‌ద్దు చేసిన ఇండోనేషియా.. ఇప్పుడు సెకండ్ వేవ్ నేప‌థ్యంలో.. వ‌రుస‌గా రెండో ఏడాది కూడా ర‌ద్దు చేసింది. కోవిడ్ కార‌ణంగానే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్ర‌క‌టించింది.. యాత్రికుల భ‌ద్ర‌తను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది కూడా హ‌జ్ యాత్ర‌కు ప్ర‌భుత్వం అనుమ‌తించ‌డం లేద‌ని మంత్రి యాకుత్ చోలిల్ కౌమాస్ వెల్ల‌డించారు.. సౌదీ అరేబియా సైతం హజ్‌కు ప్రవేశం కల్పించలేదని వివ‌రించారు.. ఇది కేవ‌లం ఇండోనేషియాకు మాత్ర‌మే ప‌రిమితం కాద‌ని.. ఇత‌ర‌ దేశాల‌కు కూడా ఎలాంటి కోటాలు కేటాయించ‌లేద‌ని.. ఇప్ప‌టికే హ‌జ్ ఫీజులు చెల్లించిన‌వారు వ‌చ్చే ఏడాది యాత్రికులు అవుతార‌ని తెలిపారు. కాగా, జీవితంలో ఒక్క‌సారైనా హ‌జ్ యాత్ర‌కు వెళ్లాల‌ని ముస్లింలు భావిస్తుంటారు.. కానీ, కోవిడ్ కార‌ణంగా కోటా విధానంతో స‌గ‌టున 20 సంవ‌త్స‌రాలు వేచి చూడాల్సిన ప‌రిస్థితులు ఉన్నాయ‌ని చెబుతున్నారు. మొత్తంగా హ‌జ్ యాత్ర‌పై సైతం క‌రోనా తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తోంది.