Site icon NTV Telugu

Iran: ఇరాన్‌లో తీవ్రమవుతున్న నిరసనలు.. భారతీయ విద్యార్థుల్లో భయాందోళనలు

Iran

Iran

ఇరాన్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఖమేనీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయి. మరోవైపు ప్రజల తిరుగుబాటుకు అమెరికా, ఇజ్రాయిల్ మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆందోళనకారులు మరింత రెచ్చిపోయి నిరసనలు కొనసాగిస్తున్నారు. ఇక భద్రతా దళాల కాల్పుల్లో ఇప్పటివరకు ఆరుగురు చనిపోయారు.

తీవ్ర ఉద్రిక్తతల మధ్య భారతీయ విద్యార్థుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. ప్రస్తుతం 3,000 మంది భారతీయ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. దీంతో వారి భద్రతపై వైద్య విద్యార్థుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇది కూడా చదవండి: Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్య.. హిందువుల్లో భయాందోళనలు

క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థను నిరసిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం డజన్ల కొద్ది నగరాల్లో నిరసనలు వ్యాప్తి చెందాయి. టెహ్రాన్, మషద్, ఇస్ఫహాన్, లోరెస్తాన్, ఖుజెస్తాన్ వంటి నగరాల్లో ఆందోళనలు ఉధృతం అయ్యాయి. అయతుల్లా ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

 

Exit mobile version