Site icon NTV Telugu

Canada: విషాదం.. భారతీయ విద్యార్థిని అనుమానాస్పద మృతి

Canadaindiastident

Canadaindiastident

కెనడాలో భారతీయ విద్యార్థిని వంశిక అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆమె మరణవార్తను భారత హైకమిషన్ ధృవీకరించింది. కేసు దర్యాప్తులో ఉందని తెలిపింది.

ఇది కూడా చదవండి: AP Capital Amaravati: అమరావతి రాజధానికి చట్టబద్ధత..!

వివరాల్లోకి వెళ్తే.. వంశిక పంజాబ్‌కు చెందిన ఆప్ ఎమ్మెల్యే కుల్జిత్ సింగ్ రాంధావా సన్నిహితుడు దేవిందర్ సింగ్ కుమార్తె. పంజాబ్‌లోని డేరా బస్సీకి చెందిన వంశిక పాఠశాల విద్యను పూర్తి చేశాక.. డిప్లొమా కోర్సును అభ్యసించడానికి రెండున్నర సంవత్సరాల క్రితం కెనడాలోని ఒట్టావాకు వెళ్లింది. అయితే ఈనెల 25న అద్దె గది కోసం బయటకు వెళ్లింది. సాయంత్రం 8-9 గంటల ప్రాంతంలో 7 మెజెస్టిక్ డ్రైవ్‌లోని నివాసం నుంచి బయటకు వెళ్లింది. రాత్రి 11:40 గంటలకు ఆమె ఫోన్ స్వి్చ్‌ఆఫ్ వచ్చింది. అంతేకాకుండా మరుసటి రోజు ఒక ముఖ్యమైన పరీక్షకు కూడా హాజరుకాలేదు. దీంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. ఆచూకీ కోసం స్నేహితులు సంప్రదించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో భారత హై కమిషన్‌ను కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఇక పోలీసులు రంగంలోకి దిగగా.. వంశిక బీచ్‌లో శవమై కనిపించింది. కుమార్తె మరణవార్త తెలిసి కుటుంబ సభ్యులు తల్లడిల్లారు.

ఇది కూడా చదవండి: Vijay Devarakonda : కింగ్‌డ‌మ్ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ డేట్ ఫిక్స్

ఇక భారత హైకమిషన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గద్దె కోసం బయటకు వెళ్లిన వంశిక.. ఇన్ని రోజులు ఎక్కడుంది? బీచ్‌కు ఎలా వెళ్లింది అన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. వంశిక మృతి పట్ల భారత హైకమిషన్ విచారం వ్యక్తం చేసింది. కేసును సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొంది. మృతురాలి బంధువులకు టచ్‌లో ఉన్నట్లు తెలిపింది.

Exit mobile version