Site icon NTV Telugu

Canada: కెనడాలో భారతీయ విద్యార్థిని అనుమానాస్పద మృతి

Canada

Canada

ఢిల్లీకి చెందిన భారతీయ విద్యార్థిని తాన్య త్యాగి కెనడాలో అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈ మేరకు భారత రాయబార కార్యాలయం తెలిపింది. జూన్ 17న చనిపోయిందని.. మరణానికి కారణాలేంటో తెలియదని పేర్కొంది. కుటుంబ సభ్యులకు సహాయ సహకరాలు అందిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. మరణానికి గల కారణాలను అన్వేషించాలని కెనడా పోలీసులను భారత కాన్సులేట్ కోరింది.

ఇది కూడా చదవండి: Air India: ఎయిరిండియా కీలక నిర్ణయం. అంతర్జాతీయ సేవలు కుదింపు

తాన్య త్యాగి.. కెనడాలోని కాల్గరీ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసిస్తోంది. ఆమె మరణానికి గల కారణాలను అధికారులు అన్వేషిస్తున్నట్లు వాంకోవర్‌లోని భారత కాన్సులేట్ పేర్కొంది. ఆమె గుండెపోటుతో చనిపోయినట్లుగా తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Yogaday Countdown : ఎల్బీ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందడి.. పాల్గొన్న సెలబ్రెటీలు

ఇక గత మార్చిలో భారత సంతతికి చెందిన 20 ఏళ్ల సుదీక్ష కోనంకి డొమినికన్ రిపబ్లిక్‌లో చనిపోయింది. ఆమె ఆచూకీనే లభించలేదు. స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్లి బీచ్‌లో ప్రాణాలు పోగొట్టుకుంది. అనంతరం తల్లిదండ్రులు.. కుమార్తె చనిపోయినట్లుగా ధృవీకరించారు. మరోసారి విదేశాల్లో భారత విద్యార్థిని చనిపోవడం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.

 

Exit mobile version