Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Navy: ఇండో – పసిఫిక్ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడేందుకు అంతర్జాతీయ వేదికపై భారత నౌకాదళం తన అజేయ శక్తిని మరోసారి చాటిచెప్పింది. ఫిలిప్పీన్స్ వేదికగా నిర్వహించిన ప్రతిష్టాత్మక ADMM-Plus జాయింట్ కోఆపరేషన్ విన్యాసాల్లో భారత యుద్ధనౌకలు ప్రధాన ఆకర్షణగా నిలిచి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించాయి. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ వంటి అగ్రదేశాల బలగాలతో కలిసి భారత నౌకాదళం సాగించిన సమన్వయ కవాతు హిందూ మహాసముద్ర, పసిఫిక్ తీరాల్లో కొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. ఫిలిప్పీన్స్‌లోని సుబిక్ బేలో సెప్టెంబర్ 21న ప్రారంభమై 25 వరకు జరిగిన ఈ మెగా ఆపరేషన్‌లో భారత్ తరఫున అత్యాధునిక యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ సహ్యాద్రి’తో పాటు క్షిపణి విధ్వంసక నౌక ‘ఐఎన్ఎస్ కులిశ్’లు రంగంలోకి దిగాయి. ఫిలిప్పీన్స్ నావికాదళ ఆతిథ్యంలో, జపాన్ సహ అధ్యక్షతన సాగిన ఈ విన్యాసాల్లో మొత్తం 6 దేశాలు భాగస్వామ్యం వహించాయి. ఇందులో భారత్, అమెరికా, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్ దేశాల సంయుక్త బలగాలు సముద్ర రక్షణే ధ్యేయంగా చేతులు కలిపాయి.
ముఖ్యంగా ‘సీ-ఫేజ్’ పేరిట సముద్ర గర్భంలో నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లలో భారత బలగాల వ్యూహాత్మక నైపుణ్యం ప్రత్యక్షంగా కనిపించింది. సముద్రంలో ఆకస్మిక విపత్తులు సంభవించినప్పుడు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టడం, ప్రమాదంలో చిక్కుకున్న నౌకలను సురక్షితంగా రక్షించడం, మెడికల్ ఎవాక్యుయేషన్, డెక్ ల్యాండింగ్ క్వాలిఫికేషన్ లాంటి అత్యంత క్లిష్టమైన కసరత్తులను అన్ని దేశాల నావికాదళాలతో కలిసి విజయవంతంగా పూర్తి చేశారు. దీనికి ముందు టేబుల్‌టాప్ ఎక్సర్సైజ్లు, కార్యాచరణ సమన్వయ సమావేశాల ద్వారా ఆయా దేశాల మధ్య వ్యూహాత్మక అవగాహనను మరింత బలోపేతం చేసుకున్నారు. భారత్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘యాక్ట్ ఈస్ట్’ పాలసీకి తోడుగా, ప్రాంతీయ శాంతి-భద్రతలే లక్ష్యంగా తీసుకొచ్చిన ‘మహాసాగర్’ (MAHASAGAR – మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ రీజియన్స్) విజన్‌కు ఈ అంతర్జాతీయ విన్యాసాలు నిదర్శనంగా నిలిచాయి. ఇండో-పసిఫిక్‌లో శాంతి సామరస్యాలు కాపాడటంలో తాము కేవలం భాగస్వామి మాత్రమే కాదని, అంతర్జాతీయ కూటమిని ముందుండి నడిపించగల అగ్రగామి శక్తి అని భారత నౌకాదళం ఈ విన్యాసాల ద్వారా ప్రపంచానికి స్పష్టమైన సందేశం పంపింది.
Also Read
- Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Iran Embassy Shares Baahubali Video: ‘తలవంచం.. మోకరిల్లం’.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ మెసేజ్. ప్రభాస్ 'బాహుబలి' వీడియో షేర్ చేసి..!
- Aleksandar Vucic Resigns: సెర్బియాలో కీలక రాజకీయ పరిణామం.. అధ్యక్ష పదవికి వుసిచ్ రాజీనామా
- Skirt: స్కర్ట్ నుంచి హిజాబ్ వరకు.. స్త్రీ శరీరంపై అధికారం ఎవరిది?
తాజావార్తలు
-
Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
-
TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాల పరీక్షల తేదీలు ఖరారు..
-
Telangana DEO : తెలంగాణలో 4 జిల్లాలకు కొత్త డీఈఓలు.. ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగింత
-
Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
-
Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!