NTV Telugu Site icon

Microsoft Layoff: రెండు దశాబ్ధాల అనుబంధం.. భారతీయ ఉద్యోగి తొలగింపు.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

Microsoft

Microsoft

Microsoft Layoff: ఆర్థికమాంద్యం భయాలు టెక్ దిగ్గజ కంపెనీలను భయపెడుతున్నాయి. ఆదాయాలు తగ్గడంతో ఖర్చులను అదుపు చేసేందుకు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్, అమెజాన్, మెటా వంటి సంస్థలు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. తాజాగా ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్ కూడా చేరింది. ఏకంగా 10,000 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. బుధవారం నుంచే తొలగింపుల ప్రక్రియను చేపట్టింది. ఈ ఏడాది మూడో త్రైమాసికం కల్లా ఉద్యోగుల తొలగింపు ఉంటుందని ప్రకటించింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం కోల్పోయిన ఓ భారతీయ ఉద్యోగి ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతోంది. మైక్రోసాఫ్ట్ సంస్థతో 21 ఏళ్ల అనుబంధాన్ని ముగించాల్సి వచ్చిందంటూ ఎమోషనల్ గా లింక్డ్‌ఇన్‌ లో పోస్టు పెట్టాడు. ప్రశాంత్ కమానీ అనే ఉద్యోగి తన తొలగింపు తనను తీవ్రంగా దెబ్బతీసిందని వార్తను లింక్డ్‌ఇన్‌లో పంచుకున్నాడు. కమాని మైక్రోసాఫ్ట్‌లో ప్రిన్సిపల్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ మేనేజర్‌గా ఉన్నారు. తాజాగా తొలగింపులో ఇతడి పేరు కుడా ఉంది.

Read Also: Amazon: యాపిల్‌ను దాటేసిన అమెజాన్..అత్యంత విలువైన కంపెనీగా

అయితే తన తొలగింపు నిరుత్సాహానికి గురిచేస్తన్నా.. తనకు అవకాశం ఇవ్వడం పట్ల మైక్రోసాఫ్ట్ కు కృతజ్ఞతలు తెలిపాడు. మైక్రోెసాఫ్ట్ లో పనిచేయడం సంతృప్తిగా ఉందని.. ఇది తనకు ‘‘రివార్డింగ్’’ అనుభవం అంటూ చెప్పారు. ‘‘ నేను అన్నింటికన్నా ఎక్కువగా కృతజ్ఞతతో ఉన్నాను. కాలేజ్ తర్వాత మైక్రోసాఫ్ట్ నా మొదటి ఉద్యోగం, జీవితం ఎలా ఉంటుందో అనే ఆలోచనలతో విదేశాలకు రావడం నాకు ఇప్పటికీ గుర్తుంది. మల్టీపుల్ కంపెనీలు, ఐసీ, మేనేజర్, క్లయింట్, హైబ్రీడ్ అండ్ సర్వీస్ సాఫ్ట్వేర్, వీ1 ప్రొడక్ట్, వీ10ప్లస్, యూఎక్స్, బ్యాక్ఎండ్ ఇలా మల్టీపుల్ రోల్స్ లో పనిచేశాను. నేను నిజంగా చెప్పగలను చాలా సంతృప్తికరంగా, బహుమతిగా ఉంది’’ అంటూ లింక్డ్‌ఇన్‌లో రాశాడు.

కమానీ ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ నుంచి గ్రాడ్యుమేషన్ పూర్తి చేశాడు. కెమిస్ట్రీలో బ్యాచిలర్ డిగ్రీ, సావిత్రీబాయి పూలే పూణే యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నాడు. కమానీ మొదటి ఉద్యోగం మైక్రోసాఫ్ట్ కంపెనీలో వచ్చింది. దీని కోసం అతడు అమెరికా వెళ్లాడు. మైక్రోెసాఫ్ట్ నా నైపుణ్యాలను నేర్చుకోవడానికి, విస్తరించడానికి నాకు అనేక అవకాశాలు ఇచ్చింది, వాటిని నేను ఉపయోగించుకున్నాను, మైక్రోెసాఫ్ట్ కు నేను కృతజ్ఞుడను అంటూ పోస్ట్ చేశాడు. మైక్రోసాఫ్ట్ లో 15 ఏళ్లు ఉద్యోగం చేసిన తర్వాత వేరే కంపెనీకి వెళ్లాడు, అమెజాన్ లో రెండేళ్లు పనిచేసిన తర్వాత 2018లో తిరిగి మైక్రోసాఫ్ట్ లో చేరాడు. దాదాపుగా 5 ఏళ్లు కంపెనీలో పనిచేసినట్లు లింక్డ్ ఇన్ లో వెల్లడించాడు.