NTV Telugu Site icon

Dubai: దుబాయ్‌లో దారుణం.. భారతీయుడ్ని చంపిన పాకిస్థానీయులు

Mdie

Mdie

దుబాయ్‌లో దారుణం జరిగింది. భారతీయ యువకుడిని పాకిస్థానీయుల గుంపు అత్యంత దారుణంగా చంపేశారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో తల్లిదండ్రులు, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్తే.. పాకిస్థానీయుల చేతిలో హతమయ్యాడంటూ భోరున విలపించారు.

ఇది కూడా చదవండి: Arvind Krishna: హీరో అరవింద్‌ కృష్ణకు అరుదైన పురస్కారం!

పంజాబ్‌లోని లూథియానాకు చెందిన 21 ఏళ్ల యువకుడు మంజోత్ సింగ్‌ పని నిమిత్తం ఏడాది క్రితం దుబాయ్ వెళ్లాడు. పాకిస్థానీ స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. ఏదొక విషయంలో రూమ్మేట్స్ గొడవ రావడంతో పాకిస్థానీయుల గుంపు దాడి చేయడంతో మంజోత్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ దాడిలో మంజోత్ స్నేహితుడు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. తన కొడుకుపై కత్తి, ఇతరు ఆయుధాలతో దాడి చేసి చంపేశారని తండ్రి మీడియా ఎదుట కంటతడి పెట్టాడు. గాయపడ్డ స్నేహితుడు కూడా ఆసుపత్రి పాలయ్యాడు.

ఇది కూడా చదవండి: UK: లండన్‌లో దారుణం.. భార్య, ఇద్దరు కుమార్తెలను చంపిన మీడియా ప్రతినిధి

మంగళవారం కుమారుడి హత్యకు సంబంధించిన వార్తలు అందాయని తండ్రి దిల్‌బాగ్ సింగ్ తెలిపారు. పాకిస్థాన్ జాతీయులు మంజోత్, అతని స్నేహితుడితో ఏదో ఒక సమస్యపై వాగ్వాదానికి దిగారని, పదునైన ఆయుధాలతో దాడి చేశారని తనకు చెప్పారని దిల్‌బాగ్ సింగ్ చెప్పాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు, తన కొడుకును విదేశాలకు పంపించామన్నారు. ఫైనాన్షియర్లు, బంధువుల నుంచి అప్పు తీసుకున్నట్లు దిల్‌బాగ్ సింగ్ తెలిపారు. కుమారుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడానికి సహాయం చేయమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.