Site icon NTV Telugu

ప్ర‌వాసుల కోసం ఇండియా స్పెష‌ల్ వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌…

క‌రోనా ఆంక్ష‌ల నేప‌థ్యంలో గ‌ల్ఫ్ దేశాల్లో చిక్కున్న ప్ర‌వాస భార‌తీయుల కోసం ఇండియ‌న్ గ‌వ‌ర్న‌మెంట్ వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌ను చేప‌ట్టేందుకు సిద్దం అయింది.  గ‌ల్ఫ్‌లోని కువైట్‌లో చిక్కుకున్న భారతీయులు తిరిగి ప్ర‌యాణాలు సాగించేందుకు వీలుగా ప్ర‌భుత్వం ఈ స్పెష‌ల్ డ్రైవ్‌ను నిర్వ‌హించ‌బోతున్న‌ది.  ప్ర‌యాణికుల‌పై విధించిన ఆంక్ష‌ల‌ను ఆగ‌స్ట్1 నుంచి కువైట్ ప్ర‌భుత్వం ఎత్తివేస్తున్న‌ది.  

Read: ‘ఇండియా’ వద్దు… ‘భారత్’ ముద్దు అంటున్న కంగనా!

దీంతో ప్ర‌యాణాలు సాగించే భార‌తీయుల‌కు అవ‌స‌ర‌మైన వ్యాక్సినేష‌న్‌, వ్యాక్సిన్ స‌ర్టిఫికెట్‌ల‌ను అంద‌జేసేందుకు కువైట్‌లోని భార‌తీయ ఎంబ‌సీ కార్యాల‌యం ఏర్పాట్లు చేస్తున్న‌ది.  కువైట్ ప్ర‌భుత్వంతో స‌మ‌న్వ‌యమై ఈ స్పెష‌ల్ డ్రైవ్‌ను నిర్వ‌హించ‌బోతున్న‌ది.  దీనికోసం ప్ర‌యాణికులు https://forms.gle/ZgRpFBTFV5V24Vqb8  లింక్‌లో త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకోవాల‌ని కొరింది. ఈ పోర్ట‌ల్లో పేరు న‌మోదు చేసుకుంటే వారికి అవ‌స‌ర‌మైన వ్యాక్సిన్‌, స‌ర్టిఫికెట్‌ల‌ను అంద‌జేస్తామ‌ని భార‌తీయ ఎంబ‌సీ అధికారులు పేర్కొన్నారు.

Exit mobile version