Site icon NTV Telugu

Indian Embassy: రష్యా-ఉక్రెయిన్‌ టెన్షన్.. రంగంలోకి భారత్..!

రష్యా- ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు అందరినీ కలవరపెడుతున్నాయి.. వీటి ప్రభావం స్టాక్‌మార్కెట్లపై కూడా పడిన విషయం తెలిసిందే కాగా… రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అప్రమత్తమైంది భారత ప్రభుత్వం.. దీనిపై భారత విదేశాంగశాక ఓ ప్రకటన విడుదల చేసింది.. ఉక్రెయిన్‌లోని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేసినట్లు వెల్లడించింది.. పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని.. ఉక్రెయిన్‌లో భారత విద్యార్థులున్నందున అప్రమత్తంగా ఉన్నామని ప్రకటించింది ప్రభుత్వం.. ఇక, భారత్‌-ఉక్రెయిన్‌ మధ్య విమాన సర్వీసులు పెంపుపై చర్చలు సాగుతున్నాయని.. ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసినట్టు ఇండియన్‌ ఎంబసీ ప్రకటించింది… ఉక్రెయిన్​లోని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది.. ఉక్రెయిన్ రాజధాని కీవ్​లోని భారత రాయబారి కార్యాలయం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Exit mobile version