Site icon NTV Telugu

Nawaz Sharif: పాకిస్తాన్ ఆర్థిక పతనానికి కారణం భారత్ కాదు, మనమే.. మాజీ పీఎం కీలక వ్యాఖ్యలు..

Nawaz Sharif

Nawaz Sharif

Nawaz Sharif: పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉంది. అప్పు కోసం ప్రపంచదేశాలను, ఐఎంఎఫ్ చుట్టూ తిరుగుతోంది. ద్రవ్యోల్భణం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు చుక్కల్ని అంటుతున్నాయి. మరోవైపు అక్కడి ప్రభుత్వం ఈ సంక్షోభం నుంచి గట్టేక్కేందుకు విద్యుత్, గ్యాస్, ఇంధన రేట్లను పెంచింది. ఈ నేపథ్యంలో వచ్చ ఏడాది పాకిస్తాన్ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అవినీతి ఆరోపణలతో ఇప్పటికే జైలులో ఉండగా.. మరో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు.

ఇదిలా ఉంటే నవాజ్ షరీఫ్ భారత్‌ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఆర్థిక కష్టాలకు భారత్, అమెరికా కారణం కాదని, మనమే అని అన్నారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(PML-N) పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, ఈ వాఖ్యలు చేశారు. 1993,1999,2017లో ప్రధానిగా పనిచేసిన నవాజ్ షరీఫ్, ప్రస్తుతం మరోసారి ప్రధాని కావాలని అనుకుంటున్నాడు.

Read Also: Italy: పెళ్లికి నిరాకరించిందని కూతురిని చంపిన పాక్ దంపతులు.. జీవిత ఖైదు విధించిన ఇటలీ కోర్టు

‘‘ ఈ రోజు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితికి భారత్, యూఎస్, ఆఫ్ఘనిస్తాన్ కారణం కాదు. వాస్తవానికి మనల్ని మనమే తగలబెట్టుకున్నాము. 2018లో వారు(పాక్ సైన్యం) రిగ్గించే చేయడం ద్వారా దేశంలో ఎంపిక చేసిన ప్రభుత్వం వల్ల ప్రజల కష్టాలకు, ఆర్థిక వ్యవస్థ పతనానికి దారి తీసింది’’ అని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. న్యాయమూర్తులు, వారికి(పాక్ సైన్యానికి) రాజ్యాంగాన్ని ఉల్లంఘించినప్పటికీ, చట్టబద్ధత కల్పిస్తారని న్యాయవ్యవస్థపై విరుచుకుపడ్డారు. ఇటీవల భారత్ దేశంలో తాను సంబంధాలను మెరుగుపరుచుకోవాలని అనుకున్నట్లు.. 1999 కార్గిల్ యుద్ధం తనకు తెలియకుండా జరిగిందని నవాజ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది. తన హాయాంలో భారత ప్రధానులు అటల్ బిహారీ వాజ్‌పేయ్, నరేంద్రమోడీలు పాకిస్తాన్ సందర్శించిన విషయాన్ని గుర్తు చేశారు.

Exit mobile version