Site icon NTV Telugu

India at UN: ఇజ్రాయిల్‌కి వ్యతిరేకంగా యూఎన్‌లో భారత్ ఓటు..

Golan Hights

Golan Hights

India at UN: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయిల్ ఆక్రమిత గోలన్ హైట్స్ నుంచి వైదొలగానిన ఐక్యరాజ్య సమితి ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానానికి భారత్ మద్దతుగా నిలిచింది. తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన 91 దేశాల్లో భారత్ కూడా ఉంది. నవంబర్ 28, మంగళవారం రోజును దీనిపై ఓటింగ్ జరిగింది.

తీర్మానం ప్రకారం.. ఇజ్రాయిల్ ఆక్రమించిన సిరియన్ గోలన్ నుంచి జూన్ 4, 1967 ముందు ఉన్న స్థానానికి వైదొగాలని పేర్కొంది. ఆక్రమిత గోలన్ హైట్స్ నుంచి వైదొలగానే తీర్మానానికి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భారత్ మద్దతుగా నిలిచింది. ఇజ్రాయిల్, సిరియాల మధ్య గోలన్ ప్రాంతం ఉంది.

Read Also: Bihar: నర్సరీ విద్యార్థినులపై స్కూల్ వ్యాన్ డ్రైవర్ అత్యాచారం..

భారత్‌తో పాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, చైనా, లెబనాన్, ఇరాన్, ఇరాక్, ఇండోనేషియాతో సహా 91 దేశాలు ఐక్యరాజ్యసమితి తీర్మానానికి అనుకూలంగా ఓటేశాయి. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, పలావు, మైక్రోనేషియా, ఇజ్రాయిల్, కెనడా, మార్షల్ ఐలాండ్స్ 8 దేశాలు వ్యతిరేకంగా ఓటేశాయి. ఉక్రెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, బెల్జియం, జపాన్, కెన్యా, పోలాండ్, ఆస్ట్రియా మరియు స్పెయిన్ సహా 62 దేశాలు గైర్హాజరయ్యాయి.

Exit mobile version