Indus Waters Treaty: ఢిల్లీలో పాక్ మంత్రి మాలిక్.. సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indus Waters Treaty: భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాల్లో సింధు జలాల ఒప్పందం కీలకమైనది.. అయితే, సింధు జలాల ఒప్పందం విషయంలో భారత్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. ఈ ఒప్పందంపై భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని విదేశాంగ శాఖ తేల్చిచెప్పింది. షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) నాగరికతల సంభాషణ వేదికలో పాల్గొనేందుకు పాకిస్థాన్ మంత్రి ముసాదిక్ మాలిక్ ఢిల్లీకి వచ్చిన నేపథ్యంలో భారత్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సింధు జలాల ఒప్పందంపై మార్పు లేదు
శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్‌కు సింధు జలాల ఒప్పందంపై ప్రశ్న ఎదురైంది. పాకిస్థాన్ మంత్రి మాలిక్ భారత్‌లో పర్యటిస్తున్న సమయంలో ఈ ఒప్పందంపై భారత్ వైఖరి ఏమిటని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. దీనికి స్పందించిన జైస్వాల్.. సింధు జలాల ఒప్పందంపై భారత్ తన వైఖరిని ఇప్పటికే స్పష్టంగా ప్రకటించిందని, అందులో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. భారత వైఖరి ఇప్పటికీ అదే విధంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Also Read
- Trump Praises India's GDP Growth: భారత్‌ను చూసి నేర్చుకోవాలి.. దేశ ఆర్థిక వృద్ధిపై ట్రంప్ ప్రశంసలు
- Pakistan Minister: తాజ్ మహల్, నిజాముద్దీన్ దర్గాకు వెళ్లాలనుకున్న పాక్ మంత్రి.. ‘నో’ చెప్పిన భారత్..
- Iran War: ఇరాన్‌పై 7 రోజుల వైమానిక దాడులకు ప్లాన్? ట్రంప్ నిర్ణయం కోసం నెతన్యాహు ఎదురుచూపులు
- Trump, Putin, Xi Jinping Meet: ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ చారిత్రాత్మక భేటీ.. 5 కీలక విషయాలు ఇవే!
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఒప్పందం నిలిపివేత
కాగా, 2025 ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి తర్వాత పాకిస్థాన్‌పై చర్యల్లో భాగంగా భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి ఈ ఒప్పందం విషయంలో భారత్ కఠిన వైఖరిని కొనసాగిస్తోంది. తాజాగా పాక్ మంత్రి ఢిల్లీ పర్యటన నేపథ్యంలోనూ కేంద్రం తన నిర్ణయంలో మార్పు లేదని స్పష్టం చేయడం గమనార్హం.
ఢిల్లీలో పాక్ మంత్రి ముసాదిక్ మాలిక్
ఎస్సీఓ నాగరికతల సంభాషణ వేదికలో పాల్గొనేందుకు పాకిస్థాన్ మంత్రి ముసాదిక్ మాలిక్ శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీకి చేరుకున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సు ఢిల్లీలోని చారిత్రక పురానా ఖిలా వేదికగా జరుగుతోంది. శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. అక్టోబర్ 28న భారత్ ఈ సదస్సుకు పాకిస్థాన్ సహా అన్ని ఎస్సీఓ సభ్య దేశాలకు ఆహ్వానాలు పంపినట్లు ప్రకటించింది. గత ఏడాది మే 7 నుంచి 10 వరకు ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఆ పరిణామాల తర్వాత భారత్‌లో జరిగే కార్యక్రమానికి పాక్ మంత్రిని ఆహ్వానించడం ఇదే తొలిసారి..
సరిహద్దు ఉగ్రవాదంపై ప్రశ్నకు పాక్ మంత్రి సమాధానం దాటవేత
సదస్సు సందర్భంగా మీడియాతో మాట్లాడిన ముసాదిక్ మాలిక్‌కు సరిహద్దు ఉగ్రవాదంపై భారత్ ఆందోళనల గురించి ప్రశ్న ఎదురైంది. అయితే ఆయన నేరుగా సమాధానం చెప్పకుండా.. మరుసటి రోజు తాను ప్రకటన చేసిన తర్వాత ఈ అంశంపై మరింత చర్చించవచ్చని పేర్కొన్నారు. ప్రాంతీయ దేశాల మధ్య సంభాషణలు జరగడం ఎంతో ముఖ్యమని, ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో ఇలాంటి వేదికలు స్వాగతించదగినవని వ్యాఖ్యానించారు.
భారత్-పాక్ సంబంధాలపై ఆశాభావం
భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశాలపై కూడా మాలిక్ స్పందించారు. ప్రాంతీయ దేశాల మధ్య సంబంధాలు సానుకూల దిశగా ముందుకు సాగాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. మారుతున్న అంతర్జాతీయ రాజకీయ పరిస్థితుల్లో ద్వైపాక్షిక విభేదాలకే పరిమితం కాకుండా, ప్రాంతీయ సమస్యలపై విస్తృత దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ, సామాజిక సవాళ్లను పరిష్కరించేందుకు పరస్పర చర్చలు, సంప్రదింపులు పెరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. వివిధ దేశాలు, నాగరికతలు, భిన్న అభిప్రాయాలు ఒకే వేదికపైకి వచ్చినప్పుడే అర్థవంతమైన సంభాషణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అయితే, ఒకవైపు ఎస్సీఓ వేదికగా పాకిస్థాన్ మంత్రి భారత్‌లో పాల్గొంటుండగా, మరోవైపు సింధు జలాల ఒప్పందంపై తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని భారత్ స్పష్టం చేసింది. ప్రాంతీయ సహకారం, చర్చలకు భారత్ ఆతిథ్యం ఇస్తున్నప్పటికీ, పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తీసుకున్న నిర్ణయంపై మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తి లేదనే సంకేతాన్ని కేంద్రం ఇచ్చింది. దీంతో మాలిక్ పర్యటన, భారత్ ప్రకటన రెండూ దౌత్యపరంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
తాజావార్తలు
-
New Bajaj Pulsar RS200: కొత్త Bajaj Pulsar RS200 లాంచ్.. Google Maps, TFT డిస్ప్లేతో క్రేజీ ఫీచర్స్.. ధర ఎంతంటే?
-
KL Rahul History: కేఎల్ రాహుల్ రికార్డుల జాతర.. టీమిండియా మొదటి బ్యాటర్‌గా అరుదైన ఘనత!
-
Indus Waters Treaty: ఢిల్లీలో పాక్ మంత్రి మాలిక్.. సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక ప్రకటన..
-
Trump Praises India’s GDP Growth: భారత్‌ను చూసి నేర్చుకోవాలి.. దేశ ఆర్థిక వృద్ధిపై ట్రంప్ ప్రశంసలు
-
Astrology: నవంబర్ 21 శనివారం దినఫలాలు.. ఈ రాశులవారికి అన్నీ శుభాలే.. కానీ..!
ట్రెండింగ్
-
World Television Day 2026: బ్లాక్ అండ్ వైట్ నుంచి స్మార్ట్ టీవీ వరకు.. ఆసక్తికర ప్రయాణం.!
-
World Hello Day 2026 : ఒక్క ‘హలో’తో ఇన్ని లాభాలా?.. నవంబర్ 21 ప్రత్యేకత ఇదే.!
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!