Site icon NTV Telugu

China: భారత్- పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధం: చైనా

China

China

China: భారత్‌- పాకిస్థాన్‌ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి చైనా రియాక్ట్ అయింది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరింది. తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని చెప్పుకొచ్చింది. ఈ సమస్యకు ముగింపు పలికేందుకు అవసరమైతే నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు తాము సిద్ధంగా ఉన్నమని బీజింగ్ స్పష్టం చేసింది.

Read Also: Deepthi Ghanta: నువ్వు సినిమాల్లో సర్వైవ్ అవ్వలేవని ముందు అన్నది నేనే.. నాని సోదరి కీలక వ్యాఖ్యలు !

ఇక, భారత్‌-పాక్ మధ్య జరుగుతున్న సైనిక దళాల ఘర్షణపై డ్రాగన్ కంట్రీ నిన్న కూడా (శుక్రవారం) స్పందించింది. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది. చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి లిన్ జియాన్‌ మాట్లాడుతూ.. భారత్‌- పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా కానీ తాము వ్యతిరేకిస్తామన్నారు.

Read Also: Fact Check: S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్పై పాక్ ఫేక్‌ న్యూస్‌ ప్రచారం.. అసలు నిజం ఇదే!

కాగా, భారత్‌–పాకిస్తాన్ సైనిక ఘర్షణలో జోక్యం చేసుకోవటం మా పని కాదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ స్పష్టం చేశారు. ఆ రెండు దేశాల మధ్య ఘర్షణలు పూర్తిగా ఆగిపోవాలని కోరుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా పేర్కొన్నారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలన్నారు. మొదట ఉగ్రవాదులు దాడి చేశారు కాబట్టి ఆ తర్వాత భారత సైన్యం ప్రతి దాడి చేసిందని పరోక్షంగా ట్రంప్ చెప్పుకొచ్చారు.

Exit mobile version