NTV Telugu Site icon

India warning: లెబనాన్‌లో భారతీయులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక

Labanon

Labanon

లెబనాన్‌లోని భారతీయ పౌరులందరూ జాగ్రత్తగా ఉండాలని భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. లెబనాన్‌లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తగు చర్యలు తీసుకోవాలని సూచించింది. బీరూట్‌లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరపాలని సూచించింది. ఈ మేరకు రాయబార కార్యాలయం తెలిపింది. లెబనాన్‌పై బాంబు దాడి చేసిన తర్వాత లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారతీయులు అప్రతమత్తంగా ఉండాలని సూచించింది.

ఇది కూడా చదవండి: Ponnam Prabhakar: జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్పై దాడిని ఖండించిన మంత్రి..

ఇప్పటికీ హమాస్-ఇజ్రాయెల్ మధ్య తీవ్ర యుద్ధం నడుస్తోంది. ఎప్పుడు ఏం జరగుతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు తాజాగా లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరుపక్షాలు కయ్యానికి సిద్ధంగా ఉన్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: HIV-positive: “నిత్య పెళ్లికూతురి”కి హెచ్ఐవీ పాజిటివ్.. అధికారుల ఉరుకులు పరుగులు..