Site icon NTV Telugu

Indo-Pak Talks: పాకిస్తాన్‌తో చర్చలకు సిద్ధమే.. స్పందించిన భారత్‌

Indo Pak Talks

Indo Pak Talks

Indo-Pak Talks: ఇండియా, పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుంది. ఈ మధ్య కాలంలో ఇది మరీ ఎక్కువగా కనిపిస్తోంది. పాకిస్తాన్ రెచ్చగొట్టే ధోరణితో వ్యవహారిస్తుండటంతో.. ఇండియా కూడా అదే దూకుడును ప్రదర్శిస్తోంది. ఇక ఇండియా, పాకిస్తాన్ దేశాల మంధ్య క్రీడా పోటీలు జరిగినా అదో యుద్ధం మాదిరిగానే చూస్తారు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇరు దేశాలు శాంతి చర్చలకు సిద్ధం అవుతున్నాయి. అయితే ముందుగా పాకిస్తాన్ నుంచే శాంతి చర్చలకు ప్రతిపాదనలు వచ్చినట్టు తెలుస్తోంది. పాకిస్థాన్ ప్రధాని ఇండియాతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌తో చర్చలకు సిద్ధమేని భారత్‌ స్పష్టం చేసింది. భార‌త్‌తో చ‌ర్చల‌కు పాకిస్తాన్ ప్రధాని షెహ‌బాజ్ ష‌రీఫ్ సంసిద్ధత వ్యక్తం చేయ‌డంపై ప్రభుత్వం గురువారం స్పందించింది. పాకిస్తాన్‌తో స‌హా అన్ని దేశాల‌తో సాధార‌ణ సంబంధాల‌కు ఉగ్రవాద ర‌హిత‌ వాతావ‌ర‌ణం నెల‌కొనాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్పష్టం చేసింది. సంప్రదింపుల‌పై పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలు త‌మ దృష్టికి వ‌చ్చాయ‌ని, పాకిస్తాన్ స‌హా పొరుగు దేశాల‌న్నింటితో సాధార‌ణ సంబంధాల‌ను తాము కోరుకుంటున్నామ‌ని, అయితే ఇందుకు స‌హృద్భావ వాతావ‌ర‌ణం త‌ప్పనిస‌రి అని విదేశీ వ్యవ‌హారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చి తెలిపారు.

Read also: Singer Mangli : మంగ్లీ కూడా మొదలెట్టేసిందిగా..

భారత్‌తో చ‌ర్చల‌కు పాక్ ప్రధాని షెహ‌బాజ్ ష‌రీఫ్ ఇటీవ‌ల సంసిద్ధత వ్యక్తం చేసిన సంగ‌తి తెలిసిందే. చ‌ర్చల ప‌ట్ల పొరుగు దేశం చిత్తశుద్ధితో ముందుకొస్తే తాము సంప్రదింపుల‌కు సానుకూలంగా ఉన్నామ‌ని, యుద్ధమ‌నేది ఎలాంటి ప్రత్యామ్నాయం కాద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. త‌మ‌ది అణ్వస్త్ర దేశ‌మ‌ని, అయితే తాము దుందుడుకుగా ముందుకెళ్లబోమ‌ని, ర‌క్షణ కోస‌మే అణ్వాయుధాల‌ను స‌మీక‌రించుకున్నామ‌ని స్పష్టం చేశారు. గ‌త 75 ఏండ్లలో తాము మూడు యుద్ధాల్లో పోరాడామ‌ని గుర్తుచేశారు. యుద్ధాల‌తో మ‌రింత పేద‌రికం, నిరుద్యోగం పెచ్చుమీర‌డంతో పాటు విద్య, వైద్యం వంటి కీల‌క రంగాల‌కు వ‌న‌రులు కొర‌వ‌డ్డాయ‌ని ఆందోళ‌న వ్యక్తం చేశారు.

Exit mobile version