Site icon NTV Telugu

Sunflower Oil: రష్యా నుంచి సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతి

భారత దేశంలో వంటనూనెలు మంట పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి భారత్‌కు వంటనూనె దిగుమతులు నిలిచిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో దేశంలో నూనె ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో రష్యా నుంచి వంటనూనెను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించిన భారత్.. ఆ దేశం నుంచి 45 వేల టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను కొనుగోలు చేసింది. ఈ దిగుమతుల కోసం భారీ ధర చెల్లించింది. పామాయిల్ సరఫరాను పరిమితం చేయాలని ఇండోనేషియా నిర్ణయించడం, దక్షిణ అమెరికాలో సోయాబీన్ సాగు తగ్గడంతో వంటనూనెల లభ్యత తగ్గింది. దీంతో రష్యానుంచి సన్ ఫ్లవర్ ఆయిల్ కొనుగోలు అనివార్యం అయిందని తెలుస్తోంది.

https://ntvtelugu.com/mafia-eye-for-women-refugees-in-ukraine/

దేశంలో ఏర్పడిన వంటనూనెల కొరతను తగ్గించుకునేందుకు రష్యానుంచి కొనుగోలు తప్పనిసరి అయిందని అధికారులు తెలిపారు. వచ్చే నెలలో భారత్‌లో దిగుమతి అయ్యేలా ఈ సంస్థ రష్యా నుంచి 12 వేల టన్నుల సన్‌ఫ్లవర్ నూనెను కొనుగోలు చేసింది. అయితే, యుద్ధానికి ముందునాటితో పోలిస్తే అత్యధిక ధర చెల్లిస్తున్నట్టు డీలర్లు అంటున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముందు టన్నుకు 1630 డాలర్లు.. భారత కరెన్సీలో రూ. 1.25 లక్షలు చెల్లిస్తే ఇప్పుడు 2,150 డాలర్లు (దాదాపు రూ. 1.65 లక్షలు చెల్లిస్తున్నట్టు పేర్కొన్నారు. అంటే టన్నుకి 40 లక్షల రూపాయలకు పైగానే ధర చెల్లించడం వల్ల వంటనూనెల ధరలు కూడా ఎక్కువగానే వుంటాయని తెలుస్తోంది.

Exit mobile version