NTV Telugu Site icon

EAM S Jaishankar: భారత ప్రయోజనాలే ఫస్ట్.. రష్యా నుంచి ఆయిల్ కొంటాం..

Jai Shankar

Jai Shankar

India has sustantial, time-tested ties with Russia, Says EAM S Jaishankar: భారత-రష్యా స్నేహం గురించి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాల పరీక్షను ఎదుర్కొని రష్యా-భారత్ సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఈ సంబంధాలను మరింతగా విస్తరించేందుకు ఇరు దేశాలు మార్గాలను అణ్వేషిస్తున్నాయని అన్నారు. మంగళవారం జైశంకర్, రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ తో రష్యా రాజధాని మాస్కోలో సమావేశం అయ్యారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారం పెరుగుతున్న క్రమంలో పరస్పర ప్రయోజనాలు రూపొందించడమే తమ లక్ష్యం అని జై శంకర్ వెల్లడించారు.

Read Also: Bharat Jodo Yatra: మరో జోడో యాత్రకు కాంగ్రెస్ ప్లాన్.. ఈ సారి ఈస్ట్ టూ వెస్ట్

కోవిడ్-19 మహమ్మారి, ఆర్థిక ఒత్తిళ్లు, వాణిజ్య ఇబ్బందులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మనం ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలను చూస్తున్నామని.. ఇరు దేశాలు కూడా వెంటనే దౌత్యమార్గాల ద్వారా చర్చించుకోవాలని జైశంకర్ కోరారు. ఇప్పటికే ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ లో ఇది యుద్దాల యుగం కానది తెలిపారని అన్నారు. భారత్, రష్యాలు బహుళ ధృవ ప్రపంచం, సమతుల్య ప్రపంచం కోసం ప్రయత్నిస్తున్నాయని అన్నారు.

చమురు, గ్యాస్ వినియోగంలో భారత్ మూడో అతిపెద్ద వినియోగదారు అని.. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుపై స్పందించారు. ఆదాయాలు ఎక్కువగా లేనప్పుడు తక్కవ ధరకు వచ్చే చమురు కోసం వెతకాలని ఆయన అన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలును కొనసాగిస్తామని వెల్లడించారు. భారతదేశ ప్రయోజనాలే ముఖ్యమని స్పషం చేశారు జైశంకర్. దీంతో పాటు ఆఫ్ఘనిస్తాన్, తీవ్రవాదం మొదలైన అంశాలపై ఇరు నాయకులు చర్చించుకున్నారు. ఉక్రెయిన్ పై రష్యా సైనికచర్య తరువాత రష్యాపై ప్రపంచదేశాలు ఆంక్షలు విధిస్తున్న సమయంలో విదేశాంగ మంత్రి జై శంకర్ రెండు రోజుల రష్యా పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇండోనేషియా బాలిలో జరిగే జీ-20 శిఖరాగ్ర సమావేశానికి ఒక వారం ముందు జైశంకర్, రష్యా పర్యటనకు వెళ్లారు.