NTV Telugu Site icon

India Economy: ఆసియాలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందే ఎకానమీగా ఇండియా

India Economy

India Economy

India Economy: ఈ ఆర్థిక సంవత్సరంలో ఆసియా ఖండంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందే ఎకానమీగా ఇండియా నిలవనుంది. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) గ్రోత్‌ సగటున ఏడు శాతానికి చేరుతుంది. తద్వారా ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో బలమైన ఎకానమీగా ఇండియా ఎదగనుందని మోర్గాన్‌ స్టాన్లీ అనలిస్టులు అంచనా వేశారు. వచ్చే పదేళ్లలో అత్యుత్తమ పనితీరుకు ఇది సంకేతమని వెల్లడించారు. ఆసియా వృద్ధిలో 28 శాతం, ప్రపంచ పురోగతిలో 22 శాతం వాటాను ఇండియా ఎకానమీ ఆక్రమించనున్నట్లు పేర్కొన్నారు.

10 రెట్లు కానున్న ఫిన్‌టెక్‌ మార్కెట్‌

మరో ఎనిమిదేళ్లలో.. అంటే 2030 నాటికి ఇండియన్‌ ఫిన్‌టెక్‌ మార్కెట్‌ 10 రెట్లు పెరగనుంది. ఆస్తుల విలువ ఒక ట్రిలియన్‌ డాలర్లకు చేరనుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పలు పథకాలు వెన్నెముకగా నిలవనున్నాయి. డిజిటల్‌ ఇండియా, స్మార్ట్‌ సిటీ, యూపీఐ లావాదేవీలు ప్రముఖ పాత్ర పోషించనున్నాయి. ఈ విషయాన్ని Chiratae వెంచర్స్‌-ఈవై రిపోర్ట్‌ వెల్లడించింది. ప్రస్తుతం మన దేశంలో 21 ఫిన్‌టెక్‌ యూనికార్న్‌లు ఉన్నాయి. అతిపెద్ద ఫిన్‌టెక్‌ యూనికార్న్‌ ఎకోసిస్టమ్‌గా ఇండియా గుర్తింపు పొందింది.

KCR to go Bihar: బీహార్ వెళ్లనున్న కేసీఆర్. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో త్వరలో ప్రయాణం.

కోలుకుంటున్న ‘ఎంఎస్‌ఎంఈ’

మన దేశంలో మైక్రో, స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ (ఎంఎస్‌ఎంఈ) రంగం కొవిడ్‌ పూర్వపు స్థాయిలకు కోలుకుంటోంది. ఈ సెక్టార్‌లో క్రెడిట్‌ డిమాండ్‌ 60% పెరిగింది. ఏడాది కాలంగా మొండి బకాయిల సంఖ్య (ఎన్‌పీఏలు) నియంత్రణలోనే ఉంది. పెరగకపోవటం గమనార్హం. ఈ మేరకు ఈసీఎల్‌జీఎస్‌ అనే కేంద్ర ప్రభుత్వ పథకం ఊతంగా నిలిచింది. ఈసీఎల్‌జీఎస్‌ అంటే.. ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్‌ గ్యారంటీ స్కీమ్‌. ఎంఎస్‌ఎంఈ రంగం రికవర్‌ అవుతున్న విషయాన్ని ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌-సిడ్బి రిపోర్ట్‌ వెల్లడించింది.

స్టాక్‌ మార్కెట్‌ అప్‌డేట్‌

ఇవాళ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమై, కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకొని, అలాగే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 57 పాయింట్లు తగ్గి 58795 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ అవుతోంది. నిఫ్టీ దాదాపు 10 పాయింట్లు తగ్గి 17500కి దిగువన ట్రేడ్‌ అవుతోంది. ఎయిర్‌టెల్‌ షేర్లు ఒక శాతం లాభపడ్డాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 79.23 వద్ద నిలకడగా ఉంది. ఫైన్‌ ఆర్గానిక్‌ షేర్లు 3 నెలల్లో ఏకంగా 56 శాతం పెరగటం విశేషం.