Site icon NTV Telugu

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై అంతర్జాతీయ నిపుణులు ఏం తేల్చారంటే..!

Operationsindoor

Operationsindoor

ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది హిందువులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా మే 7న భారత్.. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదులను హతమార్చారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలను కూడా భారత్ ధ్వంసం చేసింది.

ఇది కూడా చదవండి: Ambati Rambabu: మహానాడు తుస్సుమంది.. అంబటి సెటైర్లు

తాజాగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై అంతర్జాతీయ నిపుణులు తమ అంచనాలను వెల్లడించారు. డ్రోన్ అండ్ క్షిపణి యుద్ధంలో భారతదేశం.. పాకిస్థాన్‌పై  స్పష్టంగా గెలిచిందని అభిప్రాయపడ్డారు. నాలుగు రోజుల పాటు జరిగిన యుద్ధంలో భారతదేశమే స్పష్టంగా విజయం సాధించిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇక త్రివిధ దళాల సామర్థ్యంపై కూడా అంతర్జాతీయ నిపుణులు ప్రశంసలు కురిపించారు. అనుకున్న లక్ష్యం పూర్తయ్యాక.. ప్రశాంతమైన సంయమనానికి భారత్ పూనుకోవడంపై కూడా అభినందించారు. భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన ఉద్రిక్త పరిస్థితులు, కాల్పుల విరమణపై ముగ్గురు అంతర్జాతీయ నిపుణులు తేల్చిన తీర్పు ఇది.

ఇది కూడా చదవండి: Hyderabad: స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో భారీ మోసం.. రూ. 150 కోట్లు స్వాహా..!

భారతదేశం.. పాకిస్థాన్‌లో భారీ స్థాయిలో తన సామర్థ్యాన్ని నిరూపించుకుందని పేర్కొన్నారు. వాషింగ్టన్‌కు చెందిన విశ్లేషకుడు క్రిస్టోఫర్ క్లారీ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ తాను అనుకున్న లక్ష్యాలను ఎక్కువగా సాధించినట్లు తెలిపారు. ఏ విధంగా చూసినా భారత్.. పాకిస్థాన్‌పై చేయి సాధించిందని వెల్లడించారు. పాకిస్థాన్‌కు చెందిన క్షిపణులను భారత్ అడ్డుకోగలిందని పేర్కొన్నారు. భారత్‌కు నష్టాలు జరిగినట్లుగా ఏం కనిపించడం లేదని చెప్పారు.

ఇక లండన్‌కు చెందిన ప్రభావవంతమైన భద్రతా థింక్-ట్యాంక్ రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూట్ (RUSI)కి చెందిన వాల్టర్ లుడ్విగ్ మాట్లాడుతూ.. భారత వైమానిక దళం ప్రారంభం నుంచి విశ్వసనీయంగా పని చేసిందని తెలిపారు. ఉగ్రవాద స్థావరాలపై భారత్ పూర్తిగా విజయం సాధించిందని పేర్కొన్నారు. ఉగ్రవాద ప్రధాన కార్యాలయాలను ధ్వంసం చేసి.. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిందని తెలిపారు. పాకిస్థాన్‌కు ఇతర దేశాలు అందించిన ఆయుధాలను కూడా భారత్ సమర్థవంతం ఎదుర్కొందని చెప్పారు.

ఇక వాషింగ్టన్‌కు చెందిన బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూట్‌లో ఫెలో అయిన జాషువా టి. వైట్ మాట్లాడుతూ.. భారతీయ ఆయుధాలు.. కచ్చితమైన లక్ష్యాలను ఛేదించాయని కొనియాడారు. భారత త్రివిధ దళాలు.. రావల్పిండిలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరాన్ని, ఇతర వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాయని చెప్పారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి భారత్ కచ్చితమైన తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిందని పేర్కొన్నారు. ఇక భారతదేశం.. ఇతర దశాల మద్దతును వ్యక్తపరచడానికి ఇష్టపడలేదన్నారు. ఇక పాకిస్థాన్ ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా దిగజారిపోయిందని.. పాక్‌ను నమ్మే పరిస్థితి లేదని ముగ్గురు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత ప్రభుత్వం.. పాకిస్థాన్‌పై కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపేసింది. వీసాలను రద్దు చేసింది. అలాగే అటారీ సరిహద్దు నిలిపేసింది. ఇక మే 7న పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి.

Exit mobile version