Site icon NTV Telugu

India Assistance To Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌కు భారత్ సాయం.. వైద్యసాయం అందచేత

Afghanistan

Afghanistan

India Assistance To Afghanistan: యుద్దంతో అతలాకుతలం అయిన ఆఫ్ఘనిస్తాన్ దేశానికి భారత్ మానవతా సహాయాన్ని అందిస్తోంది. ఇప్పటికే ఆఫ్ఘన్ ప్రజల కోసం గోధుమలను, వైద్య సామాగ్రిని పంపింది. ఇదిలా ఉంటే మరోసారి వైద్య సహాయాన్ని అందిస్తోంది భారత్. భారత్ గత కొన్ని నెలల్లో 13 బ్యాచుల్లో 45 టన్నుల వైద్య సహాయాన్ని అందించింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల కోసం భారత్ సహాయాన్ని కొనాసాగిస్తుందని వెల్లడించింది. పీడీయాట్రిక్ స్టెతస్కోప్, బీపీ మిషన్లు, ఇన్ఫ్యూషన్ పంప్, డ్రిప్ ఛాంబర్ సెట్, ఎలక్ట్రో కాటరీ, నైలాన్ సూచర్లు మొదలైన సామాగ్రిలో 13వ బ్యాచ్ వైద్య సాయాన్ని పంపిస్తున్నట్లు విదేశీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సామాగ్రిని కాబూల్ లోని ఇందిరాగాంధీ చిల్డ్రన్స్ ఆస్పత్రికి అందచేయనున్నారు.

Read Also: Pakistan: మరో హిందూ బాలిక కిడ్నాప్.. 15 రోజుల్లో నాలుగో ఘటన

గతేడాది ఆగస్టులో తాలిబాన్ పాలనలోకి వెళ్లిన ఆఫ్ఘనిస్తాన్ దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఇప్పటి వరకు ఏ దేశం కూడా అక్కడి తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించలేదు. అయితే రష్యా, ఇండియా, చైనా వంటి దేశాలు తాలిబాన్ ప్రభుత్వంతో దౌత్య సంబంధాలు పెట్టుకుంటున్నాయి. గతంలో భారత్ కు చెందిన పలువురు దౌత్యవేత్తల కాబూల్ కు వెళ్లారు. ఇదిలా ఉంటే 45 టన్నుల వైద్య సహాయాన్ని అందించింది భారత్. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ ప్రజల కోసం 5 లక్షల డోసుల కోవిడ్ వ్యాక్సిన్లు, మెడికల్/ సర్జికల్ వస్తువులు మొదలైన వాటిని సాయంగా అందించింది. 40,000 మెట్రిక్ టన్నుల గోధుమలను కూడా సరఫరా చేసింది.

అయితే భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ లో కొత్త పాలనను గుర్తించలేదు. అయితే తాలిబాన్ నిజంగా అందరినీ కలుపుకోయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ నేలను ఏ దేశానికి వ్యతిరేకంగా ఎటువంటి ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించకూడదని భారత్ కోరుతోంది.

Exit mobile version