NTV Telugu Site icon

India and China Troops Clash: భారత్-చైనా సరిహద్దుల్లో మళ్లీ టెన్షన్‌.. జవాళ్లకు గాయాలు

India And China

India And China

భారత్‌-చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. అరుణాచల్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) సమీపంలో రెండు దేశాలకు చెందిన దళాలు ఘర్షణ పడ్డాయి, ఇరుపక్షాలు విడిపోయాయి ముఖాముఖి తలపడ్డారు.. ఈ ఘర్షణలో రెండు వైపుల నుండి కొంతమంది సిబ్బందికి స్వల్ప గాయాలు అయినట్టు తెలుస్తోంది.. డిసెంబరు 9న జరిగిన ఈ ఘర్షణలో డ్రాగన్‌ కంట్రీతో పాటు భారత సైనికులు కూడా కొంతమందికి స్వల్ప గాయాలు అయ్యాయి.. ఆ తర్వాత ఇరు పక్షాలు వెంటనే విడిచిపెట్టినట్టుగా తెలుస్తోంది.. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో ఎదురుకాల్పులు జరిగాయి. చైనీస్ దళాలు ఎల్‌ఏసీని దాటాయి.. ఈ చర్యను భారత సైనికులు తిప్పికొట్టినట్టు చెబుతున్నారు.. తూర్పు లడఖ్‌లో జరిగిన ఎదురుకాల్పుల తర్వాత భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరగడం ఇదే తొలిసారి.

Read Also: Cyber Crime: కిడ్నీకి రూ.7 కోట్ల ఆఫర్‌.. విద్యార్థిని నుంచి లక్షలు దోచేశారు..!

2020 జూన్‌లో గాల్వాన్ లోయలో అత్యంత ఘోరమైన ఘర్షణలు జరిగాయి. 20 మంది భారతీయ సైనికులు మరణించారు.. 40 మందికి పైగా చైనా సైనికులు మరణించారు లేదా గాయపడ్డారనే వార్తలు కూడా వచ్చిన విషయం విదితమే. ఈ సంఘటన పాంగోంగ్ సరస్సు యొక్క సౌత్ బ్యాంక్‌లో రెండు దేశాల మధ్య వరుస ఘర్షణలకు దారితీసింది. మిలిటరీ కమాండర్ల మధ్య పలు సమావేశాల తరువాత, లడఖ్‌లోని గోగ్రా-హాట్ స్ప్రింగ్స్‌తో సహా కీలకమైన పాయింట్ల నుండి భారత మరియు చైనా దళాలు వెనక్కి తగ్గాయి. ప్రభుత్వ వర్గాల ప్రకారం, సరిహద్దు గురించిన భిన్నమైన వాదనల కారణంగా 2006 నుండి ఇటువంటి ఘర్షణలు జరుగుతున్నాయి. కాగా, అరుణాచల్ ప్రదేశ్‌లోని తవంగ్ ప్రాంతంలో డిసెంబరు 9న భారత్-చైనా దళాల మధ్య ఘర్షణ జరిగినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. సుమారు 17,000 అడుగుల ఎత్తున ఉన్న శిఖరాన్ని స్వాధీనం చేసుకునేందుకు చైనాకు చెందిన సుమారు 300 మంది సైనికులు ప్రయత్నించారని, వారిని భారత సైనికులు దీటుగా తిప్పికొట్టారని తెలుస్తోంది. వాస్తవాధీన రేఖను చైనా ఉల్లంఘించిందని భారత్ చెబుతోంది.. వ్యూహాత్మకంగా కీలకమైన శిఖరాలను స్వాధీనం చేసుకోవడానికి చైనా ప్రయత్నిస్తోందని విశ్లేషకులు చెప్తున్నారు.

Show comments