NTV Telugu Site icon

India at UNSC: రష్యాకు షాక్.. ఉక్రెయిన్‌పై తీర్మానానికి భారత్ దూరం..

India At Unsc

India At Unsc

India Abstains On Russian-Sponsored Resolution Against Ukraine At UN: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉక్రెయిన్ పై రష్యా ప్రతిపాదించిన తీర్మానానికి భారత్ దూరంగా ఉంది. అమెరికా, ఉక్రెయిన్ ల్యాబుల్లో ‘సైనిక జీవసంబంధ కార్యకలాపాలు’ జరుగుతున్నాయని రష్యా ఆరోపిస్తూ.. ఈ తీర్మానాన్ని భద్రతా మండలి ముందుకు తీసుకువచ్చింది. దీన్ని పరిశోధించేందుకు ఓ కమిషన్ ఏర్పాటు చేయాలని రష్యా కోరింది. జీవ ఆయుధాల ఒప్పందాన్ని ఉక్రెయిన్ ఉల్లంఘించిందని రష్యా ఆరోపించింది. భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాలు అయిన ఐదు దేశాల్లో చైనా, రష్యాలే ఈ తీర్మాణానికి అనుకూలంగా ఓటేశారు. అమెరికా, యూకే, ఫ్రాన్స్ దేశాలు వ్యతిరేకంగా ఓటేశాయి. భారతదేశంతో సహా, ఇతర తాత్కాలిక సభ్యదేశాలు అన్ని ఈ తీర్మానానికి గైర్హాజరు అయ్యాయి.

Read Also: PM Narendra Modi: “మజెల్ తోవ్ మై ఫ్రెండ్”.. బెంజమిన్ నెతన్యాహూకు నరేంద్ర మోదీ శుభాకాంక్షలు

యూఎన్ లోని భారతదేశ శాశ్వత మిషన్ కౌన్సిలర్ అమర్ నాథ్ మాట్లాడుతూ.. భారతదేశం బయోలాజికల్ వెపన్ కన్వెన్షన్(బీడబ్ల్యూసీ) ఒప్పందానికి ప్రాధాన్యాత ఇస్తోందని.. బీడబ్ల్యూసీని మరింతగా మెరుగుపరచడానికి మేము కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. యూఎస్ రాయబారి లిండా థామస్ గ్రీన్ ఫీల్డ్..రష్యా ఆరోపణలను తోసిపుచ్చారు. ఇది తప్పుడు సమాచారం అని అన్నారు. ఈ ఆరోపణలపై రష్యా సాక్ష్యాలు అందించడంలో విఫలమైందని అన్నారు. రష్యా మాత్రం భద్రతా మండలిలో ఈ తీర్మానం ఒక ముఖ్యమైన మైలురాయి అని అభివర్ణించింది.

గతంలో కూడా పలుమార్లు ఐక్యరాజ్యసమితిలో భారత్, రష్యా-ఉక్రెయిన్ వ్యవహారాలకు దూరంగా ఉంది. ఇరు దేశాలు కూడా దౌత్యం, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచిస్తోంది. పలు మార్లు రష్యాకు వ్యతిరేకంగా వెస్ట్రన్ దేశాలు ప్రతిపాదించిన తీర్మానాలపై ఓటింగ్ కు భారత్ దూరంగా ఉంది. ఈ అంశంలో భారత్ సమదూరాన్ని పాటిస్తోంది. ఇదిలా ఉంటే రష్యా వ్యవహారంలో భారత్ ప్రతీసారి గైర్హాజరు కావడంపై పాశ్చాత్య దేశాలు కొన్నిసార్లు అసహనం వ్యక్తం చేశాయి. అక్కడి మీడియా భారత్ ను నిందిస్తూ రష్యాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని పలు కథనాలను కూడా ప్రసారం చేసింది.

Show comments