NTV Telugu Site icon

Pakistan: పాకిస్తాన్ కరెన్సీపై భుట్టో బొమ్మ ఉండాలని తీర్మానం..

Zulfiqar Ali Bhutto

Zulfiqar Ali Bhutto

Pakistan: పాకిస్తాన్ కరెన్సీపై మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో ఫోటో పెట్టాలని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) తీర్మానం ప్రవేశపెట్టింది. పీపీపీ పార్టీ వ్యవస్థాపకుడైన భుట్టోని జాతీయ ప్రజాస్వామ్య హీరోగా ప్రకటించాలని, కరెన్సీ నోట్లపై అతని బొమ్మ పెట్టలాని ప్రభుత్వాన్ని కోరుతూ ఆదివారం తీర్మానాన్ని ఆమోదించారు. జుల్ఫికర్ అలీ భుట్టోపై చర్చిస్తూ ‘‘భుట్టో రిఫరెన్స్ అండ్ హిస్టరీ’’ అనే సెమినార్ సందర్భంగా ఈ తీర్మానాన్ని ఆమోదించారు.

పీపీపీ వ్యవస్థాపకుల్లో ఒకటిగా ఉన్న అహ్మద్ రెజా కసూరి హత్యకు ఆదేశించాడనే జుల్ఫికర్ అలీ భుట్టోపై అభియోగాలు నమోదయయ్యాయి. అయితే ఆ సమయంలో పాకిస్తాన్‌ని పాలిస్తున్న మహ్మద్ జియా ఉల్ హక్ కావాలనే అతడిని ఇందులో ఇరికించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో అతడిని ఉరితీశారు. ఇటీవల పాక్ సుప్రీంకోర్టు అతడి ఉరిశిక్షను తప్పుపట్టింది. తాజా తీర్మానంలో భుట్టోకి ‘‘క్వాయిడ్ ఏ అవామ్’’ (ప్రజల నాయకుడు) బిరుదును ప్రదానం చేయాలని పాక్ ప్రభుత్వాన్ని తీర్మానం కోరింది. దీంతో పాటు పాక్ అత్యున్నత పురస్కారం నిషన్-ఏ-పాకిస్తాన్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Read Also: Russia Ukraine War : రష్యాపై ఉక్రెయిన్ కాల్పులు.. 10అంతస్తుల భవనం కూలి ఆరుగురు మృతి

కరెన్సీ నోట్లపై భుట్టో చిత్రాన్ని ఉంచాలని డిమాండ్ చేయడంతో పాటు, భుట్టో గౌరవార్థం తగిన స్మారక చిహ్నాన్ని నిర్మించాలని, ఆయన సమాధిని జాతీయ మందిరంగా ప్రకటించాలని తీర్మానం కోరినట్లు స్థానిక మీడియా నివేదించింది. భుట్టోకు విధించిన అన్యాయమైన మరణశిక్షను రద్దు చేయాలని మరియు దాని కోసం తమ జీవితాలను త్యాగం చేసిన ప్రజాస్వామ్య ఉద్యమకారులకు ఇచ్చేందుకు ‘‘జుల్ఫికర్ అలీ భుట్టో అవార్డు’’ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు, జాతీయ అసెంబ్లీ మార్చిలో జుల్ఫికర్ అలీ భుట్టో విచారణను న్యాయపరమైన హత్యగా ప్రకటిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. హ్యా నేరంలో భుట్టోకి ఏప్రిల్ 4, 1979న ఉరితీశారు.