Site icon NTV Telugu

Imran Khan: ప్రధాని మోదీని ప్రశంసించిన పాకిస్తాన్ మాజీ ప్రధాని

Imran Khan

Imran Khan

Imran Khan once again praised PM Modi: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, భారత ప్రధాని నరేంద్రమోదీపై మరోసారి ప్రశంసలు కురిపించారు. అవినీతి విషయంలో ఆ దేశ మాజీ ప్రధాని ముస్లింలీగ్ పార్టీ అధినేత నవాజ్ షరీఫ్ విమర్శిస్తూ.. భారత ప్రధానిపై ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలో ఏ దేశ నాయకుడు కూడా నవాజ్ షరీఫ్ సంపాదించినంతగా విదేశాల్లో ఆస్తుల్ని కూడబెట్టలేదని విమర్శలు గుప్పించారు. నవాజ్ షరీఫ్ విదేశాల్లో బిలియన్ల ఆస్తులను కలిగి ఉన్నారని అన్నారు. ఒక దేశానికి చట్టబద్ధ పాలన లేకపోతే.. పెట్టుబడులు రావని.. అవినీతి జరుగుతుందని ఆయన అన్నారు.

భారత ప్రధాని నరేంద్రమోదీకి దేశం బయట ఎన్ని ఆస్తులున్నాయని..నవాజ్ షరీఫ్ లాగా భారత ప్రధాని నరేంద్రమోదీ విదేశాల్లో ఆస్తుల్ని కూడబెట్టలేదని ప్రశంసించారు. విదేశాల్లో నవాజ్ కి ఎన్ని ఆస్తులు ఉన్నాయో ఊహించలేరని ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు.

Read Also: Nitin Gadkari: వాయు కాలుష్యం ప్రధాన సమస్య.. భవిష్యత్తు అంతా గ్రీన్ ఎనర్జీదే

అవిశ్వాసంలో పాకిస్తాన్ ప్రధాని నుంచి వైదొలిగిన తర్వాత నుంచి ఇమ్రాన్ ఖాన్ తరుచుగా ఇండియాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. భారతదేశం స్వతంత్య్రంగా వ్యవహరిస్తుందని.. పాకిస్తాన్ మాత్రం ఇతర దేశాల ఆదేశాల మేరకు మాత్రమే పనిచేస్తుందని ఆయన గతంలో వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాలనతో సైన్యం ప్రమేయం ఉండదని ఆయన గతంలో అన్నారు. పశ్చిమ దేశాలు, అమెరికా ఒత్తడి చేస్తున్నా కూడా భారత్, రష్యా నుంచి తక్కువ ధరకు చమురును దిగుమతి చేసుకుంటుందని ఇమ్రాన్ ఖాన్ భారత విదేశాంగ విధానంపై ప్రశంసలు కురిపించారు. భారత దేశంపై ఏ సూపర్ పవర్ కూడా ప్రభావం చూపలేదని పొగిడారు.

అధికారం కోల్పోయినప్పటి నుంచి వరసగా షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు ఇమ్రాన్ ఖాన్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తూ ప్రజామద్దతు కూడగడుతున్నారు. అమెరికా చెప్పినట్లు పాకిస్తాన్ ప్రధాని ఆడుతున్నారని గతంలో విమర్శించారు. అయితే ఇటీవల ఇమ్రాన్ ఖాన్, న్యాయమూర్తులను, పోలీసులు బెదిరించే విధంగా మాట్లాడటంతో ఆయనపై ఉగ్రవాద చట్టాల కింద కేసులు నమోదు అయ్యాయి.

Exit mobile version