NTV Telugu Site icon

Imran Khan attack: ఇమ్రాన్ ఖాన్ హత్యాయత్నం వెనక ఉన్నది వీరే..

Iman Khan

Iman Khan

Imran Khan names three suspects behind attack. Pak PM Shehbaz Sharif is one of them: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై హత్యాయత్నం ఆ దేశాన్ని ఓ కుదుపు కుదిపేస్తోంది. గురువారం పంజాబ్ ప్రావిన్సులోని వజీరాబాద్ పట్టణంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ముందస్తు ఎన్నికలు డిమాండ్ చేస్తూ ర్యాలీ చేస్తున్న సమయంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఈ ర్యాలీని నిర్వహిస్తోంది. ఈ దాడిలో ఇమ్రాన్ ఖాన్ కాలికి గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ను లాహోర్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కాల్పుల ఘటనలో ఒక వ్యక్తి మరణించగా.. పార్టీ నేతలు అహ్మద్ చత్తా, ఫైసల్ జావేద్ సహా 13 మంది గాయపడ్డారు.

Read Also: TRS MLAs: సుప్రీంకోర్టుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు.. నేటితో తెరపడనుందా?

ఇది ఖచ్చితంగా హత్యాయత్నమే అని పీటీఐ నాయకుడు ఫవాద్ చౌదరి అన్నారు. ఈ దాడిని ప్రధాని షహబాజ్ షరీఫ్ తో పాటు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేత ఆసిఫ్ అలీ జర్దారీ, పలువురు మంత్రులు ఖండించారు. ఇదిలా ఉంటే ఈ దాడి వెనక ప్రధాని షహబాజ్ షరీఫ్, పాక్ ఇంటీరియర్ మినిస్టర్ రాణా సనావుల్లా, ఐఎస్ఐ చీఫ్ మేజర్ జనరల్ ఫైసల్ నసీర్ ఉన్నట్లుగా ఇమ్రాన్ ఖాన్ సన్నిహితుడు అసద్ ఉమర్ ఆరోపించారు. తనకు వచ్చిన వివరాల ప్రకారం ఈ హత్యాయత్నానికి వీరు ముగ్గురే కారణం అంటూ ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని ఇమ్రాన్ ఖానే వెల్లడించినట్లు ఆయన తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ పై జరిగిన దాడిని అమెరికా ఖండించింది. తనను దేవుడు కాపాడి మరో జీవితాన్ని ప్రసాదించినట్లు ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నాడని ఆయన పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కారణంగానే తాను దాడికి పాల్పడినట్లు నిందితుడు తెలిపాడు. అయితే నిందితుడి అంగీకారాన్ని బయటకు పొక్కేలా చేసిన ఇద్దరు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది అక్కడి ప్రభుత్వం. ఈ దాడిపై షహబాజ్ షరీఫ్ ఫ్రభుత్వం అత్యున్నత విచారణకు ఆదేశించింది. అయితే అవిశ్వాసం ద్వారా పదవిని కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్ వరసగా ప్రధాని షహజాబ్ షరీఫ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. పాకిస్తాన్ సైన్యాన్ని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ దాడి జరిగింది.