NTV Telugu Site icon

Imran Khan: ‘‘పాకిస్తాన్‌లో ఈవీఎంలు ఉంటే’’.. ఎన్నికలపై ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు..

Imran Khan

Imran Khan

Imran Khan: ఫిబ్రవరిలో దాయాది దేశం పాకిస్తాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల ఓటమి కోసం చాలా చోట్ల రిగ్గింగ్‌కి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే, తాజాగా వీటిపై ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం)లు ఉంటే రిగ్గింగ్‌ సమస్యల్నీ గంటలో పరిష్కారమయ్యేవని ఆయన అన్నారు. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) చీఫ్ అడియాలా జైలులో మీడియాతో మాట్లాడుతూ ఈవ్యాఖ్యలు చేశారు.

Read Also: Afghanistan: ఆఫ్ఘాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు-ట్యాంకర్ ఢీ.. 21 మంది మృతి..

పాకిస్తాన్ ఎన్నికల సంఘం, కొన్ని రాజకీయ పార్టీలు ఎలక్ట్రిక్ ఓటింగ్ యాత్రాలను తీసుకురావాలనుకున్న తన ప్రణాళికను నాశనం చేశాయని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల ఆదేశాన్ని దొంగిలించిన అధికారులపై దేశద్రోహ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తమ పార్టీ ఎన్నికల్లో 30 మిలియన్ల ఓట్లను సాధించిందని, మిగిలిన 17 రాజకీయ పార్టీలు ఉమ్మడిగా ఇదే సంఖ్యలో ఓట్లు సాధించాయని ఆయన అన్నారు.

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తోషఖానా, అల్-ఖాదిర్ ట్రస్ట్ వంటి అవినీతి కేసుల్లో జైలులో ఉన్నారు. ఎన్నికల ముందు సైన్యం ఇతడిని కావాలనే జైలులో పెట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. పీటీఐ పార్టీ చిహ్నం ‘బ్యాట్’ని కుట్రతో తిరస్కరించారు, ప్రజలు ఇచ్చిన ఆదేశాన్ని దొంగిలించడం దేశద్రోహానికి సమానమని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఇమ్రాన్ ఖాన్ దేశాన్ని దివాళా అంచును ఉండాడని ఇతర పార్టీలు చేస్తున్న ఆరోపణల్ని కొట్టిపారేశారు. 2018లో నవాజ్ షరీఫ్ పార్టీ 20 బిలియన్ డాలర్ల లోటును మిగిల్చిందని, ఆ సమయంలో ఐఎంఎఫ్‌ని సంప్రదించడం తప్ప వేరే మార్గం లేదని చెప్పారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం లేదని, రుణాన్ని చెల్లించగలిగితే, మళ్లీ రుణాలను పొందాలని ఆయన సూచించారు.