NTV Telugu Site icon

Lebanon: ఇజ్రాయెల్ దాడుల్లో హిజ్బుల్లా కమాండర్ హతం.. లెబనాన్ ప్రకటన

Lebanon

Lebanon

హిజ్బుల్లా లక్ష్యంగా సోమవారం లెబనాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 28 చిన్నారుల సహా 558 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయాలు పాలయ్యారు. తాజాగా ఈ దాడుల్లో లెబనాన్‌ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల్లో హిజ్బుల్లా కమాండర్‌ ఇబ్రహీం క్వబైసీ హతమయ్యాడు. ఈ విషయాన్ని లెబనాన్ రక్షణ వర్గాలు ధృవీకరించాయి. ఈ దాడిలో కమాండర్‌తో పాటు మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు లెబనాన్ రక్షణ వర్గాలు వెల్లడించాయి. హిజ్బుల్లా క్షిపణి వ్యవస్థకు ఇబ్రహీం కమాండర్‌గా వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy: అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తాం

గత వారం నుంచి హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. పేజర్లు, వాకీటాకీలు పేల్చి వందలాది మందిని చంపేసింది. సోమవారం మాత్రం దాదాపు 300 రాకెట్లు ప్రయోగించి లెబనాన్‌ను అతలాకుతలం చేసింది. ఈ మధ్య కాలంలో ఇదే అత్యంత భారీ దాడిగా తెలుస్తోంది. కేవలం క్షిపణి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు ఇజ్రాయెల్‌ రక్షణశాఖ వెల్లడించింది. భవిష్యత్‌లోనూ దాడులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే సామాన్య పౌరులు ఇళ్లను విడిచిపెట్టి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ప్రకటన చేసింది. హిజ్బుల్లా నేతలకు మానవ కవచాలుగా మారొద్దని వార్నింగ్ ఇచ్చింది.

ఇది కూడా చదవండి: DSC: డీఎస్సీ 2008 అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..