Site icon NTV Telugu

Israel: పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌‌ను అడ్డుకున్న ఐడీఎఫ్

Gretathunberg

Gretathunberg

గాజాలో మానవతా సాయం చేసేందుకు వెళ్తున్న పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ బృందాన్ని ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకుంది. ఫ్రీడమ్‌ ఫ్లొటిల్లా కూటమి అనే సంస్థ ఆధ్వర్యంలో గాజాకు వస్తున్న  నౌకలో థన్‌బర్గ్, 12 మంది ఆందోళనకారులు ఉన్నారు. జూన్ 1న ఇటలీ నుంచి సహాయ సామాగ్రితో కూడిన మాడ్లీన్‌ నౌక బయల్దేరింది. అయితే ఐడీఎఫ్ దళాలు అడ్డుకున్న సమయంలో లైఫ్ జాకెట్లతో చేతులు పైకెత్తి కూర్చున్న వ్యక్తుల ఫొటోను యూరోపియన్ పార్లమెంట్ సభ్యురాలు రిమా హసన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఇది కూడా చదవండి: French Open 2025 Winner: మరోసారి ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా అల్కరాజ్..!

ఇటలీలోని ఓడరేవు కాటానియా నుంచి మాడ్లీన్ నౌక బయల్దేరింది. అందులో గ్రెటా థన్‌బర్గ్ కూర్చుని ఉంది. అయితే గ్రెటా థన్‌బర్గ్ ప్రయాణిస్తున్న నౌకను అడ్డుకుంటామని ఆదివారం ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ తన కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేసింది. ఆమె యూదు ద్రోహి అని.. ఇజ్రాయెల్ వ్యతిరేకి అని.. హమాస్‌ ప్రచార కార్యకర్త అని.. గాజాకు వెళ్లలేరు. తిరిగి వెళ్లిపోవాలని మంత్రి సూచించారు. హమాస్‌కు ఆయుధాలు చేరకుండా ఉండేందుకు ఎవరినీ గాజాకు అనుమతించడం లేదని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి తెలిపారు. అయితే శనివారం ఈ నౌక ఈజిప్ట్ జలాల్లోకి ప్రవేశించి గాజాకు చేరుకుంది. వెంటనే ఇజ్రాయెల్ కమాండోలు ప్రవేశించి అడ్డుకున్నారు.

ఇది కూడా చదవండి: Anantapur: ప్రేమ వ్యవహారమే యువతీ దారుణ హత్యకు కారణమా..?!

2023, అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి బందీలుగా తీసుకెళ్లింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్.. హమాస్ అంతమే లక్ష్యంగా దాడి చేస్తోంది. ఇప్పటికే గాజా నాశనం అయింది. అంతేకాకుండా గాజా సరిహద్దులు మూసేయడంతో ఆహార వస్తువులు లోపలికి వెళ్లడం లేదు. దీంతో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. అయితే రెండు వారాల నుంచి ఇజ్రాయెల్ సరిహద్దులను తెరిచింది. దీంతో స్వచ్చంధ సంస్థలు.. కొద్ది కొద్దిగా మానవతా సాయం వెళ్తోంది. అలాగే పర్యావరణ కార్యకర్త థన్‌బర్గ్ ఆధ్వర్వంలో ఒక బృందం ఇజ్రాయెల్‌కు బయల్దేరింది. అయితే ఆమె ఇజ్రాయెల్ ద్రోహి అని.. ఆమెను గాజా వెళ్లకుంటామని ఇజ్రాయెల్ ముందే ప్రకటించింది. అన్నట్టుగానే ఇజ్రాయెల్ దళాలు అడ్డుకున్నాయి.

 

 

 

 

Exit mobile version