Site icon NTV Telugu

Iran: నెలల్లోనే పుంజుకుంటుంది.. అణు సామర్థ్యంపై ఐఏఈఏ కీలక ప్రకటన

Iaea Chief Rafael

Iaea Chief Rafael

ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులు చేశాయి. ప్రాముఖ్యంగా ఫార్డో అణు కేంద్రాన్ని బీ-2 బాంబర్లు ధ్వంసం చేశాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెబుతున్నారు. తాజాగా ఇదే అంశంపై అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) అధిపతి రఫేల్‌ గ్రాసీ స్పందించారు. ఇరాన్ అణు కేంద్రాలకు ఎలాంటి ఢోకా ఉండదని.. ఒకవేళ ధ్వంసమైనా కొన్ని నెలల్లోనే పుంజుకుంటుందని స్పష్టం చేశారు. టెహ్రాన్ మరికొన్ని నెలల్లో అణు ఇంధనం శుద్ధి చేయడాన్ని ప్రారంభించగలదని చెప్పారు. అమెరికా బాంబులు వేసినా పూర్తిగా నాశనం కాలేదని రాఫేల్ గ్రాసీ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy : పాశమైలారం ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

ఇక ఇరాన్ రాయబారి అమీర్-సయీద్ ఇరావీనీ ఆదివారం ఐక్యరాజ్యసమితిలో మాట్లాడుతూ.. అణు సుసంపన్నత ఎప్పటికీ ఆగదన్నారు. కొన్ని వారాల్లోనే అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయడాన్ని ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఇది ఎంతో దూరంలో లేదని చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Venky Atluri : ‘తొలిప్రేమ’ నా ఫస్ట్ సినిమా కాదు

తాజాగా ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ అణు కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు చెప్పారు. ఇప్పట్లో ఇరాన్ కోలుకోలేదని.. అలాంటి పరిస్థితి వచ్చినా ఈసారి గట్టిగా దెబ్బకొడతామని హెచ్చరించారు.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును దేవుని శత్రువులుగా పరిగణిస్తూ ఇరాన్‌లోని ప్రముఖ షియా మతాధికారి అయతుల్లా నాజర్ కమరెం షిరాజీ ఫత్వా జారీ చేశారు. వీరికి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా వీరిద్దరికి ఏ ముస్లిం నాయకులు కూడా మద్దతు ఇవ్వొద్దని ఫత్వాలో పేర్కొన్నారు.

Exit mobile version