Site icon NTV Telugu

Hubble Telescope: సూర్యుడి కన్నా 530 రెట్లు పెద్దదైన నక్షత్రం పేలుడును గుర్తించిన హబుల్

Supernova

Supernova

Hubble looks back in time to see huge star explode 11 billion years ago: హబుల్ టెలిస్కోప్ విశ్వంలోని మరో అద్భుత దృశ్యాన్ని చిత్రీకరించింది. సుదూరంగా ఉన్న ఓ నక్షత్రం పేలిపోయిన సంఘటనలను ఫోటోలు తీసింది. 11 బిలియన్ ఏళ్ల క్రితం విశ్వం తొలినాళ్లలో ఉన్న సమయంలో జరిగిన పేలుడును టెలిస్కోప్ రికార్డ్ చేసింది. ప్రస్తుతం విశ్వం వయసు సుమారుగా 3.8 బిలియన్ సంవత్సరాలుగా ఉంది. మన సూర్యడితో పోలిస్తే 530 రెట్లు పెద్దదిగా ఉండే నక్షత్రం పేలిపోతూ.. దానిలోని వాయువులను విశ్వంలోని వెదజల్లుతూ చనిపోయింది.

Read Also: KL Rahul: కేఎల్ రాహుల్‌పై విమర్శల వర్షం.. ఇంకోసారి టీమ్‌లో కనిపిస్తే ఫసక్

నక్షత్రం పేలిపోతూ సూపర్ నోవాగా మారడాన్ని హబుల్ గుర్తించింది. సూపర్ నోవాను ప్రారంభ దశలో గుర్తించడం చాలా సులువని.. ఇది కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల వరకు మాత్రమే ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. విశ్వ చరిత్రలో ఇంత త్వరగా సూపర్ నోవాను ఖగోళ శాస్త్రవేత్తలు చూడటం ఇదే మొదటిసారి. ప్రారంభ విశ్వం, నక్షత్రాలు, గెలాక్సీల ఏర్పాటు గురించి తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని నాసా తెలిపింది.

విశ్వంలోని ప్రతీ నక్షత్రం కూడా ఎప్పుడో సమయంలో మరణిస్తుంటుంది. దానిలోని హైడ్రోజన్, హీలియం అయిపోయినప్పుడు నక్షత్రాలు పతనం అంచుకు చేరుకుంటాయి. రెడ్ జాయింట్ గా ఏర్పడి నక్షత్రం పరిమాణం కన్నా కొన్ని వేల రెట్లు పెద్దదిగా అవుతూ.. ఒక్కసారిగా దాని కేంద్రంలో కుప్పకూలుతుంది. సూర్యుడి వంటి చిన్న నక్షత్రాలు తెల్లని మరగుజ్జు నక్షత్రంగా మారుతాయి. అయితే సూర్యుడితో పోలిస్తే కొన్ని వేలు, లక్షల రెట్లు పెద్దదిగా ఉండే నక్షత్రాలు మాత్రం బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్ గా మారుతుంటాయి. ఇలా రెడ్ జాయింట్, సూపర్ నోవా, తెల్లని మరగుజ్జు నక్షత్రంగా మారే సమయాల్లో వివిధ రంగుల్లో నక్షత్రాలను చూడవచ్చు.

సౌర కుటుంబానికి ఆధారం అయిన సూర్యుడు కూడా 5-8 బిలియన్  ఏళ్ల తర్వాత సూర్యుడు కూడా చనిపోయే అవకాశం ఉంది. సూర్యుడిలోని శక్తికి కారణం అవుతున్న హైడ్రోజన్, హీలియం వాయువులు పూర్తిగా ఖర్చు కావడంతో సూర్యుడి పరిణామం మన భూమి దాకా పెరుగుతుంది. అంటే బుధుడు, శుక్రుడు, భూమి వంటి గ్రహాలను పూర్తిగా కబలిస్తాడు. ఆ తరువాత ఒక్కసారిగా తన కేంద్రంలో కూలిపోయి, మరగుజ్జు నక్షత్రంగా మారుతాడు.

Exit mobile version