NTV Telugu Site icon

Pager Blasts: “పేజర్‌”లతో హిజ్బుల్లా ఎలా దెబ్బతీసింది..? ఇజ్రాయిల్ “మోసాద్” డెడ్లీ ఆపరేషన్ ఇదే..

Peger Blast

Peger Blast

Pager Blasts: హిజ్బుల్లాలపై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. లెబనాన్, దాని రాజధాని బీరూట్‌పై భీకర దాడులు చేస్తోంది. ఇప్పటికే హిజ్బుల్లా చీఫ్ నస్రల్లాతో పాటు అతడి వారసుడిగా చెప్పబడుతున్న షహీమ్ సఫీద్దీన్‌ని హతం చేసింది. కీలక కమాండర్లను ఒక్కొక్కరిగా వెంటాడి వేటాడి చంపేసింది. ప్రస్తుతం హిజ్బుల్లా తల లేని శరీరంలా తయారైంది. అయితే, హిజ్బుల్లా పతనం గత నెలలో జరిగిన ‘‘పేజర్‌ల’’ పేలుడుతో మొదలైంది. లెబనాన్ వ్యాప్తంగా హిజ్బుల్లా కార్యకర్తలు, మద్దతుదారులు, ఫైనాన్సియర్ల చేతుల్లో ఉన్న పేజర్లు ఒకే సమయంలో బాంబుల్లా పేలాయి. ఈ దాడిలో 30 మంది వరకు చనిపోగా, 3000 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. చాలా మంది తమ అవయవాలను, కంటి చూపుని పోగోట్టుకున్నారు.

అయితే, పేజర్‌లతో హిజ్బుల్లాను చావు దెబ్బతీయడం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల గూఢచార ఏజెన్సీలను ఆశ్చర్యపరిచాయి. ఇజ్రాయిల్ స్పై ఏజెన్సీ ‘‘మోసాద్’’ పనితనాన్ని కొనియాడారు. ఇంత పెద్ద డెడ్లీ ఆపరేషన్‌ని మోసాద్ ఎలా చేసింది.. హిజ్బుల్లా చేత పేజర్లను ఎలా కొనేలా చేసిందనే దానిపై ది వాషింగ్టన్ పోస్ట్ కీలక కథనం నివేదించింది. హిజ్బుల్లా ఇజ్రాయిల్ ఉచ్చులో ఎలా చిక్కుకుందనే వివరాలను వెల్లడించింది.

మొబైల్, శాటిలైట్ ఫోన్లు వాడితే ఇజ్రాయిల్ నిఘా సంస్థలు ఇట్టే గుర్తిస్తాయని, హిజ్బుల్లా పేజర్లను వాడటం మొదలుపెట్టింది. అయితే, ఇదే హిజ్బుల్లాను దెబ్బతీసేలా చేసింది. WAPO ప్రకారం, AR924 పేజర్.. కఠినమైన యుద్ధభూమి పరిస్థితులన్ని తట్టుకునేలా తయారు చేశారు. హిజ్బుల్లా కోసమే అన్నట్లుగా దీని డిజైన్ ఉంది. వాటర్ ఫ్రూఫ్ డిజైన్, ఛార్జింగ్ లేకుండా నెలల తరబడి ఉండేలా భారీ బ్యాటరీ ఉంటుంది. ఇజ్రాయిల్ ఇంటలెజెన్స్ నుంచి తప్పించుకునేలా తయారు చేయబడిందని హిజ్బుల్లా భావించింది. ఆ సమయంలో ఇందులో పేలుడు పదార్థాలు ఉన్నా్యని, మోసాద్ ఉచ్చులో ఉన్నామన్న సంగతి హిజ్బుల్లాకి తెలియదు.

Read Also: Bengal girl murder: అత్యాచారాన్ని ప్రతిఘటించినందుకే బాలికని చంపేశా.. నిందితుడు మోస్తకిన్ సర్దార్..

ఫిబ్రవరిలో హిజ్బుల్లా నాయకులు 5000 మంది ఈ పేజర్లను కొనుగోలు చేశారు. వీటిని మధ్యస్థాయి కమాండర్లు, ఇతర సహాయక సిబ్బందికి పంపిణీ చేశారు. సెప్టెంబర్ 17 అసలు ఆపరేషన్ మొదలైంది. మోసాద్ రిమోట్‌గా పేజర్లను యాక్టివేట్ చేసింది. దీంతో ఒక్కసారిగా 3000 మంది హిజ్బుల్లా సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. వీటిలో 30 మందికి పైగా చనిపోయారని చెబుతున్నప్పటికీ, మృతులు వందల్లో ఉంటారని సమాచారం.

పేజర్లను తయారు చేసిన తైవాన్‌కి చెందిన గోల్డ్ అపోలోతో సంబంధం ఉన్న మార్కెటింగ్ అధికారి ద్వారా హిజ్బుల్లాకి వీటికి విక్రయించేలా చేశారు. అయితే, సదరు వ్యక్తి మోసాద్ తరుపున పనిచేస్తున్నట్లు వారికి తెలియదు. AR924 పేజర్ చాలా అత్యుత్తమైనదని మార్కెటింగ్ చేశారు. దీంతో ఈ ఆఫర్‌ని హిజ్బుల్లా అందుకుంది. బ్యాటరీ ప్యాక్‌లోనే పేలుడు పదార్ధాలను ఉంచారు. ఈ పేజర్లకు రెండు దశల ఎన్‌క్రిప్షన్ ప్రక్రియ ఉంటుంది. దీంతో యూజర్ దీనిని రెండు చేతులతో పట్టుకోవాలి. ఈ దశలో పేలుడు జరిగితే వారికి తీవ్ర గాయాలవుతాయని మోసాద్ అంచనా వేసింది. అనుకున్నట్లుగానే జరిగింది. సెప్టెంబర్ 12న ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో సమావేశం తర్వాత పేజర్లను పేల్చేయాలనే నిర్ణయం వచ్చింది.

నెతన్యాహూ మోసాద్‌కి ఓకే చెప్పడంతో ఒకే సమయంలో లెబనాన్‌లో పేజర్లు టపాసుల్లా పేలాయి. దీని తర్వాత వాకీ-టాకీలు, సోలార్ ప్యానెళ్లు, ఇతర ఎలక్ట్రిక్ డివైజెస్ కూడా పేలాయి. కొన్ని రోజుల పాటు లెబనాన్ వ్యాప్తంగా ఏ ఎలక్ట్రిక్ పరికరాన్ని చూసిన పరిగెత్తాల్సిన పరిస్థితి వచ్చింది. 2022లోనే ఇజ్రాయిల్‌కి ఈ పేజర్ ఆలోచన వచ్చింది. హమాస్ అక్టోబర్ 07 దాడి కన్నా ఏడాది ముందే మోసాద్ ఈ ఆపరేషన్ ప్రారంభించింది.