US Government: సమాఖ్య సర్కార్ కార్యకలాపాలకు నిధులు సమకూర్చడంతో పాటు వివిధ ఆర్థిక బాధ్యతలు నిర్వర్తించేందుకు జో బైడెన్ ప్రభుత్వం తీసుకునే రుణ పరిమితిని పెంచేందుకు కాబోయే ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్ (పార్లమెంటు హౌస్ ) గురువారం నాడు తిరస్కరించింది. దీంతో యూఎస్ సర్కార్ షట్‌డౌన్ నివారణకు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రయత్నం ఫెయిల్ అయినట్లైంది. ఈ పరిణామంతో పలు ఫెడరల్ సంస్థల కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోనున్నాయి. అమెరికన్ కాంగ్రెస్ హౌస్ కొన్ని ఫెడరల్ సంస్థల కార్యకలాపాలకు సంబంధించిన ఆర్థిక ప్రతిపాదనలకు 3/2 మెజారిటీతో సకాలంలో ఆమోదం తెలపకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. యూఎస్ పార్లమెంటులో డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన రిపబ్లికన్ పార్టీకి నామమాత్రపు మెజారిటీ మాత్రమే ఉండటంతో.. షట్‌డౌన్ ప్రభావం సమాఖ్య సర్కార్ చేసే 25 శాతం వ్యయానికే పరిమితమైంది.
కాగా, 174–235 ఓట్ల తేడాతో రుణ పరిమితి పెంపు బిల్లు వీగిపోయింది. అయితే, శుక్రవారం అర్ధరాత్రి తుది ప్రయత్నంగా తమ ప్రతిపాదనలను మరోసారి సభలో ప్రవేశ పెడతామని స్పీకర్ మైక్ జాన్సన్ పేర్కొన్నారు. ప్రకృతి విపత్తులకు ఇచ్చే సహాయంతో పాటు రైతులకు ఆర్థిక సాయం కలిపి 110 బిలియన్ డాలర్లను జో బైడెన్ సర్కార్ వ్యయ బిల్లులో ప్రతిపాదించింది. అయితే, రుణ పరిమితి పెంచితేనే ఓకే చేస్తామని ట్రంప్ అనుకూలురు తెలిపారు. ఈ బిల్లుపై స్పష్టత రాకుంటే ప్రభుత్వ పాలన స్తంభించే ప్రమాదం ఉంది.