NTV Telugu Site icon

Pakistan: పాకిస్తాన్‌కు హోండా గుడ్ బై.. కుదేలైన పాక్ ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ

Honda

Honda

Pakistan economic crisis: పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశం నుంచి ప్రముఖ కంపెనీలు వెళ్లిపోతున్నాయి. తాజాగా ఆటోమొబైల్ దిగ్గజం హోండా కూడా పాకిస్తాన్ కు గుడ్ బై చెప్పింది. బుధవారం తన ప్లాంట్ ను మూసేస్తున్నట్లు హోండా ప్రకటించింది. సప్లై చైన్ కు అంతరాయం ఏర్పడటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం పాకిస్తాన్ లో హోండా అట్లాస్ కార్స్ పేరుతో కార్లను అసెంబుల్ చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులే మూసివేతకు కారణం అని సదరు సంస్థ ప్రకటించింది. మార్చి 9 నుంచి 31 వరకు ఫ్లాంట్ మూసేస్తున్నట్లు ప్రకటించింది.

Read Also: Satish Kaushik: బాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకనటుడు సతీష్ కౌశిక్ మృతి

పాకిస్తాన్ తన ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకునే ప్రయత్నాల్లో ఉంది. అక్కడి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. దీంతో సీకేడీ కిట్లు, ముడిపదార్ధాలు, విదేశీ చెల్లింపుల కోసం ఎల్సీఎస్(లెటర్ ఆఫ్ క్రెడిట్స్) నిలిపేయడం వంటివి ప్రారంభించడంతో సప్లై చైన్ తీవ్రంగా దెబ్బతింది. దీంతో ఇక పాకిస్తాన్ లో వ్యాపారం చేయలేవని హోండా భావించింది. ముఖ్యంగా పాకిస్తాన్ ఆటోమొబైల్ పరిశ్రమ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉంది. కేవలం అసెంబ్లింగ్ మాత్రమే పాకిస్తాన్ లో జరుగుతుంది. ఇటీవల పాక్ ప్రభుత్వం దిగుమతులపై విపరీతంగా పన్నులు పెంచింది. ఇది కూడా అక్కడి పరిశ్రమను దెబ్బతిసింది. హోండాకు ముందు పాక్ సుజుకీ మోటార్ కంపెనీ, సింధు మోటార్ కంపెనీ, పాకిస్తాన్ లోని టయోటా బ్రాండ్ ఆటోఆటోమొబైల్స్ ఆ దేశం నుంచి వైదొలిగాయి.