Hollywood Actress Brooke Shields Shares Her Bad Experience In Her Documentary: పరాయి మగాళ్లతోనే కాదు.. తెలిసిన వ్యక్తుల వద్ద కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. తమకిచ్చిన చనువుని అడ్డం పెట్టుకొని, కొందరు దారుణాలకు పాల్పడుతున్నారు. మాయమాటలు చెప్పి మరీ, లైంగిక దాడులకు దిగుతున్నారు. ఇందుకు హాలీవుడ్ నటి బ్రూక్ షీల్డ్స్‌కి జరిగిన ఉదంతమే ప్రత్యక్ష ఉదాహరణ. తెలిసిన వ్యక్తే కదా అని నమ్మి అతనితో వెళ్తే.. హోటల్‌కి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. అయితే.. ఆ సమయంలో ఏం చేయలేక తాను మౌనంగా ఉండిపోయానని, ఆ బాధని దిగమింగుకున్నానని ఆ నటి ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల తాను విడుదల చేసిన ప్రెట్టీ బేబీ డాక్యుమెంటరీలో.. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను బ్రూక్ వెల్లడించింది.
Team India: టాస్ సమయంలో రోహిత్ సైలెంట్.. కారణం ఇదేనా?
బ్రూక్ మాట్లాడుతూ.. ‘‘నేను గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత పలుసార్లు అతనితో కలిశాను. ఒక రోజు నేను పని నిమిత్తం వెళ్తుంటే.. టాక్సీ పిలుస్తానని చెప్పాడు. అనంతరం ఆ టాక్సీలో హోటల్‌కి తీసుకెళ్లాడు. భయంభయంతోనే నేను ఆ హోటల్‌లో అడుగుపెట్టాను. ఇక రూమ్‌లోకి వెళ్లిన తర్వాత అతడు నాపై లైంగిక దాడి చేశాడు. ఆ సమయంలో నేను అతడ్ని ఎదురించలేకపోయా. అప్పుడు నాకు షాక్ తగిలినట్లు అనిపించింది. పూర్తిగా స్థంభించిపోయా. అతనితో ఫైట్ చేయలేక.. కేవలం ‘నో’ అంటూ అరిచాను. అయినా అతడు వదిలిపెట్టలేదు. దాంతో.. నేను అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడితే చాలని అనుకొని, మౌనంగా ఉండిపోయా’’ అని చెప్పుకొచ్చింది. ఒకవేళ ఎదురిస్తే, తనపై అతడు దాడి చేస్తాడేమోనన్న భయంతోనే మౌనంగా ఉండాల్సి వచ్చిందని ఆమె వివరించింది.
Rakul Preet Singh: రకుల్ ప్రీత్‌కి ఘోర అవమానం.. కూరలో కరివేపాకులా..
తనపై లైంగిక దాడికి పాల్పడిన అనంతరం ఆ వ్యక్తం బాత్రూంకి వెళ్లాడని, అక్కడి నుంచి ఒక్కసారిగా అదృశ్యమయ్యాడని బ్రూక్ తెలిపింది. అదే అదునుగా తాను ఆ హోటల్ నుంచి బయటకు వచ్చేశానని పేర్కొంది. ఈ ఘటన తర్వాత తన స్నేహితుడైన సెక్యూరిటీ హెడ్ గావిన్ డి బెకర్‌కు ఫోన్ చేశానని గుర్తు చేసుకుంది. ఇప్పటివరకు ఈ సంఘటన గురించి తాను ఎక్కడా బహిరంగంగా మాట్లాడలేదని చెప్పింది. అయితే.. తనపై లైంగిక దాడికి పాల్పడిన ఆ వ్యక్తి వివరాలు మాత్రం బ్రూక్ వెల్లడించలేదు.
Man Chops Private Part: వీడెవడండీ.. పెళ్లాం రావడం లేదని దాన్నే కోసేసుకున్నాడు..