NTV Telugu Site icon

Khalistanis Attacked Hindus: కెనడాలో హిందూ భక్తులపై ఖలిస్తానీల దాడి.. ఖండించిన ట్రూడో

Canada

Canada

Khalistanis Attacked Hindus: బ్రాంప్టన్‌లోని హిందూ సభా మందిర్‌లోని భక్తులపై ఖలిస్తానీలు దాడికి దిగారు. ఈ ఘటనను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో హింసాత్మక చర్యలు ఆమోదయోగ్యం కాదన్నారు. ప్రతి కెనడియన్‌కు తమ విశ్వాసాన్ని స్వేచ్ఛగా, సురక్షితంగా ఆచరించే హక్కు ఉందన్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి వేగంగా స్పందించినందుకు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు ప్రధాని ట్రూడో.

Read Also: CM Revanth Reddy : తెలంగాణలో బీసీ కులగణనకు డెడికేషన్‌ కమిషన్‌

కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కెనడియన్ ఎంపీలతో సైతం పోస్ట్ చేయడంతో తొందరగా వైరల్ అయింది. ఈ సంఘటన యొక్క వీడియోలో ఆలయం వెలుపల ఖలిస్థానీ అనుకూల గ్రూపులతో సంబంధం ఉన్న జెండాలను ప్రదర్శించడంతో పాటు కర్రలతో చిన్నారులు, మహిళలపై కూడా దాడి చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ సంఘటన గురించి తెలిసన కెనడియన్ పోలీసులు భారీగా సిబ్బందిని మోహరించారు. పీల్ ప్రాంతీయ పోలీసు చీఫ్ నిషాన్ దురైయప్ప అందరు సంయమనం పాటించాలని కోరారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉంది.. హింస, నేరపూరిత చర్యలను తాము సహించమన్నారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కెనడియన్ పోలీసులు వెల్లడించారు.

Show comments