Site icon NTV Telugu

Durga Puja In Bangladesh: దుర్గాపూజపై ఆంక్షలు.. నమాజ్ ప్రారంభానికి ముందే లౌడ్‌స్పీకర్లు బంద్

Ban

Ban

Durga Puja In Bangladesh: బంగ్లాదేశ్‌లో కొత్తగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం దుర్గా పూజల నిర్వహణకు పలు ఆంక్షలు విధిస్తుంది. బంగ్లాదేశ్‌లో దుర్గాపూజల కోసం 32 వేల 666 వేదికలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహ్మద్ మొయినుల్ ఇస్లాం మాట్లాడుతూ.. గత కొంతకాలంగా మత అల్లర్ల జరుగుతున్నాయి.. వీటిని దృష్ట్యాలో ఉంచుకుని.. దేశంలో మరింత కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దుర్గాపూజలు మొదలుకొని, విగ్రహ నిమజ్జనం వరకు మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా.. ఉండేందుకు సైబర్ నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే, అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా నేషనల్ ఎమర్జెన్సీ సర్వీస్ 999కి డయల్ చేసి సమాచారం ఇవ్వొచ్చని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహ్మద్ మొయినుల్ చెప్పారు.

Read Also: Ambati Rambabu: జగన్ తిరుమల పర్యటన రద్దుకు ప్రభుత్వమే కారణం..

కాగా, బంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖ సలహాదారు మహ్మద్ జహంగీర్ ఆలం చౌదరి మాట్లాడుతూ.. దుర్గాపూజ వేదికల కారణంగా ముస్లిం అనుచరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని తెలిపారు. వారి నమాజ్ ప్రారంభానికి ఐదు నిమిషాల ముందు లౌడ్‌ స్పీకర్లు బంద్ చేయాలని కోరారు. బంగ్లాదేశ్ మత వ్యవహారాల సలహాదారు అబుల్ ఫైజ్ ముహమ్మద్ ఖలీద్ హుస్సేన్ మాట్లాడుతూ.. హిందువుల భద్రతకు తాము హామీ ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. అక్టోబరు 3వ తేదీ నుంచి దుర్గాపూజలు స్టార్ట్ కానున్నాయి. అక్టోబర్ 12న ముగుస్తాయి. అక్టోబర్ 8, 9 తేదీలలో పెద్ద సంఖ్యలో భక్తులు దుర్గాపూజలకు హాజరు కానున్నారు.

Exit mobile version