NTV Telugu Site icon

Israel Hezbollah War: ఇజ్రాయెల్ మిలిటరీ కంపెనీపై హెజ్‌బొల్లా దాడి.. తిప్పికొట్టిన ఐడీఎఫ్

Hezbolla

Hezbolla

Israel Hezbollah War: ఇజ్రాయెల్‌, లెబనాన్‌ కు చెందిన హెజ్‌బొల్లా గ్రూప్‌ మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌ టెల్ అవీవ్ శివార్లలోని తా అని పిలువబడే ఇజ్రాయెల్ మిలిటరీ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌పై హెజ్‌బొల్లా ఉగ్రవాద సంస్థ క్షిపణులతో దాడి చేసింది. తాము చేసిన దాడుల్లో మిసైల్స్‌ ఖచ్చితమైన టార్గెట్లను చేరుకొన్నాయని తెలిపారు. ఈ మేరకు బుధావారం రాత్రి హెజ్‌బొల్లా ఓ ప్రకటనను రిలీజ్ చేసింది. లెబనాన్ నుంచి సెంట్రల్ ఇజ్రాయెల్ వైపు నాలుగు మిసైల్స్‌ను హెజ్‌బొల్లా ప్రయోగించిందని వాటిలో రెండింటిని అడ్డుకున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెల్లడించింది. మరో రెండు నివాస స్థలాలకు దూరంగా పడిపోయాయని చెప్పుకొచ్చింది. ఈ మిసైల్స్‌ దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఐడీఎఫ్ చెప్పుకొచ్చింది.

Read Also: Live in Partner Murder: స్క్రూడ్రైవర్, సుత్తితో లివిన్ రిలేషన్ షిప్ పార్టనర్ ను హత్య చేసిన మహిళా

మరోవైపు, ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని కాన్ టీవీ న్యూస్ ఛానల్.. వెస్ట్ బ్యాంక్‌లోని కల్కిలియా నగరం సమీపంలో ఒక మిసైల్‌ పడిపోయినట్లు కథనం ప్రసారం చేసింది. ఆ మిసైల్‌ దాడికి ఒక వ్యక్తికి స్వల్పంగా గాయాలు కాగా, ఒక కారు ధ్వంసమైనట్లు ప్రకటించింది. ఇక, సెప్టెంబర్ 23వ తేదీ నుంచి ఇజ్రాయెల్ సైన్యం హెజ్‌బొల్లాను అంతం చేయటమే లక్ష్యంగా లెబనాన్‌పై తీవ్రమైన వైమానిక దాడులను కొనసాగిస్తుంది. అక్టోబరు నెల ఆరంభంలో ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనీస్ సరిహద్దుకు సమీపంలో ఒక గ్రౌండ్ ఆపరేషన్‌ను కూడా చేసింది. హెజ్‌బొల్లా ఆర్థిక మూలాలు, సామర్థ్యాలను బలహీనపరచటమే లక్ష్యంగా ఐడీఎఫ్ దాడులు కొనసాగిస్తుంది.