NTV Telugu Site icon

Syria-Lebanon: సిరియాలో ఉద్రిక్తత.. 2 వేల యోధులను పంపిన లెబనాన్

Syrialebanon

Syrialebanon

సిరియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరికాసేపట్లో సిరియా రాజధాని డమాస్కస్‌ను రెబల్స్ స్వాధీనం చేసుకోనున్నారు. అతి సమీపంలో తిరుగుబాటుదారులు ఉన్నారు. ఇప్పటికే పలు నగరాలు స్వాధీనం చేసుకున్నారు. రాజధాని డమాస్కస్ స్వాధీనం చేసుకుంటే సిరియా దేశం రెబల్స్ హస్తగతం అయినట్లే.

ఇది కూడా చదవండి: HYDRA Commissioner: మూసీ పరివాహకంలో మట్టిపోసిన నిర్మాణ సంస్థలపై హైడ్రా కమిషనర్ ఆగ్రహం

ఇదిలా ఉంటే తిరుగుబాటుదారులను ఎదుర్కొనేందుకు హిజ్బుల్లాకు చెందిన 2,000 మంది యోధులను లెబనాన్ సిరియాకు పంపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సిరియాలోని క్యుసైర్ ప్రాంతానికి యోధులను పంపినట్లు సమాచారం. సిరియాలో హిజ్బుల్లా తన స్థానాలను కాపాడుకోవడానికి యోధులను పంపినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే సిరియన్ తిరుగుబాటుదారులతో ఇంకా ఎటువంటి యుద్ధాల్లో పాల్గొనలేదని సమాచారం. ఇదిలా ఉంటే సాయుధ తిరుగుబాటుదారులను ఎదుర్కొనేందుకు ఇరాన్-మద్దతుగల ఇరాకీ మిలీషియాలు కూడా సిరియాలో మోహరించినట్లు తెలుస్తోంది. మరోవైపు డమాస్కస్ సరిహద్దుల్లోంచి సైన్యం పారిపోయినట్లుగా వస్తున్న వార్తలను సిరియా రక్షణ శాఖ ఖండించింది. ఆ వార్తలను కొట్టిపారేసింది.

ఇది కూడా చదవండి: Syria: సైన్యం పరార్.. తిరుగుబాటుదారుల చేతుల్లోకి రాజధాని డమాస్కస్!

సిరియాలోని తిరుగుబాటు కూటమి ఇప్పటికే సిరియాలోని రెండు ప్రధాన నగరాలు, ఉత్తరాన అలెప్పో, హమాను స్వాధీనం చేసుకుంది. 2011 నుంచి సిరియా యుద్ధంలో అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ దళాలతో కలిసి పోరాడారు. అయితే తాజాగా అధ్యక్షుడు పరారీలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రక్షణ శాఖ మాత్రం ఖండిస్తుంది.  గత వారం ఇస్లామిస్ట్ నేతృత్వంలోని తిరుగుబాటుదారుల దాడి ప్రారంభమైనప్పటి నుంచి హిజ్బుల్లా నుంచి గానీ.. ఇరాన్ నుంచి సరైన సపోర్ట్ దొరకలేదని తెలుస్తోంది. నవంబర్ 27న హెజ్బుల్లా- ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ అమలులోకి వచ్చింది. దీంతో లెబనీస్ సమూహం ఊపిరిపీల్చుకుంది. తాజాగా సిరియా తిరుగుబాటుదారుల ద్వారా ముప్పు పొంచి ఉండడంతో హిజ్బుల్లా ఎలాంటి సాహసం చేస్తుందో చూడాలి.

ఇది కూడా చదవండి: Fire Breaks Out In Running Car: తిరుమలలో రన్నింగ్‌ కారులో మంటలు.. పరుగులు తీసిన భక్తులు