NTV Telugu Site icon

Israel: హిజ్బుల్లా డేంజరస్ గేమ్ ఆడుతోంది.. లెబనాన్‌ని యుద్ధంలోకి లాగుతోంది..

Israael

Israael

Israel: ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై హమాస్ ఉగ్రవాదులు క్రూరమైన దాడి చేశారు. కిబ్బుట్జ్‌లోకి ప్రవేశించి ప్రజలను చిన్నాపెద్ద, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా ఊచకోత కోశారు. ఈ దాడిలో 1400 మంది ఇజ్రాయిలీ పౌరులను చంపేశారు. 200కు పైగా మందిని బందీలుగా చేసుకుని గాజాలోకి తీసుకెళ్లారు. అయితే ఈ దాడుల తర్వాత గాజా స్ట్రిప్ పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేస్తోంది. ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో 4000 మంది పాలస్తీనియన్లు చనిపోయారు.

Read Also: India-Canada: ట్రూడోని చూసి ఇండియాలో నవ్వుకుంటున్నారు.. కెనడా ప్రతిపక్ష నేత విమర్శలు..

ఇదిలా ఉంటే హమాస్ ఉగ్రవాదులకు మద్దతుగా, ఇజ్రాయిల్ ఉత్తర భాగంలో లెబనాన్ మిలిటెంట్ సంస్థ, ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా మిలిటెంట్లు కూడా ఇజ్రాయిల్ పై దాడులకు సిద్ధమవుతున్నారని ఇజ్రాయిల్ మిలిటరీ ఆదివారం తెలిపింది. హిజ్బుల్లా ఇజ్రాయిల్ సరిహద్దులపై కాల్పులను తీవ్రం చేసింది. హిజ్బుల్లా, లెబనాన్ ను యుద్ధంలోకి లాగుతోందని, దీని వల్ల చాలా నష్టపోతారని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) ప్రతినిధి జోనాథన్ కన్రికస్ హెచ్చరించారు.

హిజ్బుల్లా చాలా ప్రమాదకరమైన గేమ్ ఆడుతోందని, పరిస్థితి తీవ్రతను పెంచుతోందని, మేము ప్రతీరోజు దాడులను ఎదుర్కొంటున్నామని ఆయ అన్నారు. గాజాలోని హమాస్ ఉగ్రవాదుల కోసం లెబనాన్ ను ప్రజల శ్రేయస్సును, లెబనీస్ సార్వభౌమాధికారాన్ని ప్రమాదంలో పడేసేందుకు లెబనాన్ సిద్ధంగా ఉందని వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ ఉత్తరాన, లెబనాన్ సరిహద్దుల్లో ఉన్న 20,000 జనాభా ఉన్న పట్టణాన్ని ఇజ్రాయిల్ అధికారులు ఖాళీ చేయించారు. నిన్న ఇజ్రాయిల్ రక్షణ మంత్రి గాలెంట్ మాట్లాడుతూ.. లెబనాన్ యుద్ధంలో చేరుతున్నట్లు సమాచారం ఉందని, ఇదే గనుక జరిగితే వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.