ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా విరుచుకుపడింది. టెల్ అవీవ్‌పై హిజ్బుల్లా క్షిపణులను ప్రయోగించింది. దీంతో ఆయా ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. పలువురు ఇజ్రాయెల్ పౌరులు గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హిజ్బుల్లా దాడుల్లో కొన్ని బిల్డింగ్‌లు ధ్వంసం అయ్యాయి. అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఇక ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.
ఇది కూడా చదవండి: Canada: భారత్ వెళ్లే ప్రయాణికుల సెక్యూరిటీ తనిఖీ పెంచిన కెనడా.. కారణం ఇదే..
ఇదిలా ఉంటే అమెరికా రాయబారి అమోస్ హోచ్‌స్టెయిన్ బీరుట్‌లో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటనలో ఉండగానే హిజ్బుల్లా.. ఇజ్రాయెల్‌పై దాడి చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ పార్లమెుంట్‌లో ప్రధాని నెతన్యాహు ప్రసంగిస్తూ ఇరాన్ అణు స్థావరంపై దాడి చేసింది తామేనని ప్రకటించారు. ఇక అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక.. మరిన్ని దాడులు ఉంటాయని తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాజాగా టెల్ అవీవ్‌పై హిజ్బుల్లా దాడులకు తెగబడడంతో మరింత ఉద్రిక్తతలకు దారి తీయొచ్చని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Stock Market: వరుస నష్టాలకు బ్రేక్.. లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
హమాస్ మద్దతుగా ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా దాడి చేయడంతో లెబనాన్‌పై ఐడీఎఫ్ దళాలు విరుచుకుపడ్డాయి. ఆయా ప్రాంతాలను ధ్వంసం చేశాయి. ఇక హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను అంతమొందించాయి. ఈ ఘటనతో ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై కాలు దువ్వింది. ఒకేసారి 180 క్షిపణులను ఇజ్రాయెల్‌పై ప్రయోగించింది. కాకపోతే ఐడీఎఫ్ దళాలు.. గగనతలంలోనే పేల్చేశాయి.
🚨🇮🇱🇱🇧 BREAKING: TEL AVIV is BURNING after successful HEZBOLLAH MISSILE ATTACK. pic.twitter.com/mculOuqCdf
— Legitimate Targets (@LegitTargets) November 19, 2024