NTV Telugu Site icon

Hezbollah Attacks: మరోసారి ఇజ్రాయెల్పై దాడి చేసిన హిజ్బుల్లా..

Hizbella

Hizbella

Hezbollah Attacks: హిజ్బుల్లా గ్రూప్ మరోసారి ఇజ్రాయెల్ నగరమైన హైఫాపై దాడి చేసింది. ఇజ్రాయెల్ ఇజ్రాయెలీ ఓడరేవు నగరమైన హైఫాపై దక్షిణ లెబనాన్ నుంచి రాకెట్లతో దాడికి దిగింది. అక్టోబర్ 7వ తేదీన హమాస్ దాడి వార్షికోత్సవం సందర్భంగా ఈ దాడులకు దిగింది. ఈ సమయంలో ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థ ఈ రాకెట్లను పూర్తిగా ఆపడంలో ఫెయిల్ అయింది. దీంతో సుమారు ఐదు రాకెట్లు వారి లక్ష్యాలపై పడ్డాయి. ఈ దాడిలో దాదాపు 10 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. గత నెలలో బీరుట్‌లో ఇజ్రాయెల్ బాంబు దాడిలో మరణించిన తమ నాయకుడు హసన్ నస్రల్లాకు హిజ్బుల్లాకు ఈ దాడిని అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.

Read Also: IND vs BAN: ఇది నాకు రీబర్త్‌డే.. భావోద్వేగానికి గురైన టీమిండియా ప్లేయర్!

ఈ దాడులపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. నేను ఉత్తర సరిహద్దులో IDF సైనికులతో ఇక్కడ ఉన్నాను.. మా దేశంపై హిజ్బుల్లా దాడి చేయడ్డాన్ని తీవ్రంగా ఖండించారు. త్వరలోనే ఈ ఉగ్రవాద మూకలను పూర్తిగా అంతం చేస్తామన్నారు. కాగా, లెబనీస్ సరిహద్దులోని ఐడీఎఫ్ ఆర్మీ బేస్ 36వ డివిజన్ ఫైటర్స్‌ను ఇజ్రాయెల్ ప్రధాని సందర్శించారు. నార్తర్న్ కమాండ్ మేజర్-జనరల్ హెడ్‌తో కలిసి భద్రతా పరమైన అంశాలపై ఆరా తీశారు.

Show comments