Site icon NTV Telugu

Hezbollah-Israel war: ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా 50 రాకెట్ల ప్రయోగం.. ఒకరి మృతి.. ఇళ్లు ధ్వంసం

Hezbollah

Hezbollah

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా 50 రాకెట్లను ప్రయోగించింది. ఈ రాకెట్లు గోలన్ హైట్స్‌ను తాకాయి. దీంతో ప్రైవేటు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ జరిపిన దాడికి ప్రతీకారంగా బుధవారం ఈ దాడి జరిగినట్లుగా సమాచారం. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించగా.. మరో 19 మంది గాయపడ్డారు. గాజాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇజ్రాయెల్- హిజ్బుల్లా మధ్య గత 10 నెలలుగా తరచూ కాల్పులు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణ చర్చల కోసం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ప్రయత్నాలు జరుపుతున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: PM Modi in Poland: పోలాండ్ చేరుకున్న మోడీ.. 45 ఏళ్ల తర్వాత తొలిసారి!

ఇటీవల హమాస్ అగ్ర నేత హనియే, అలాగే హిజ్బుల్లా అగ్ర నేతలు మృతి చెందారు. దీనికి ఇజ్రాయెల్‌ కారణమని భావిస్తున్నాయి. మరోవైపు ఇరాన్‌లో హనియే హతం కావడంతో ఇజ్రాయెల్‌పై పగతో రగిలిపోతున్నారు. ఏదొక క్షణంలో ఇరాన్ దాడులకు తెగబడవచ్చని అమెరికా భావిస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్‌పై అమెరికా అండగా నిలిచింది.

ఇది కూడా చదవండి: Maharaja: బాలీవుడ్ చిత్రాలను వెనక్కి నెట్టి నెట్‌ఫ్లిక్స్‌లో మహారాజా మాస్ రికార్డ్..!

Exit mobile version