Maharaja: బాలీవుడ్ చిత్రాలను వెనక్కి నెట్టి నెట్‌ఫ్లిక్స్‌లో మహారాజా మాస్ రికార్డ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Sethupathi’s ‘Maharaja’ tops Netflix charts : ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించిన సినిమాల జాబితాలో విజయ్ సేతుపతి నటించిన మహారాజా మొదటి స్థానంలో నిలిచింది. అంతకు ముందు అంతలేదు కానీ కరోనా కాలంలో OTT ప్లాట్‌ఫారమ్‌లు జనానికి బాగా అలవాటయ్యాయి. కొత్త సినిమాలు కూడా నేరుగా విడుదలయ్యేంత ఆదరణ పొందడమే కాకుండా, థియేటర్లలో విడుదలయ్యే సినిమాల డిజిటల్ హక్కులు కూడా అధిక ధరలకు కోనేస్థాయికి ఈ ఓటీటీలు పాపులర్ అయ్యాయి. ఈ కారణంగా, ఏదైనా కొత్త సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన నెల రోజుల్లో OTTలో విడుదల అవుతుంది, ఏవో రేర్ కేసెస్ లో తప్ప. దీంతో థియేటర్‌లో సినిమా చూడలేకపోయిన వారు ఓటీటీలో చూసి ఆనందిస్తున్నారు. ఓటీటీలలో అగ్రగామిగా ఉన్న నెట్‌ఫ్లిక్స్ ఈ ఏడాది తన OTT సైట్‌లో ఇప్పటివరకు అత్యధికంగా వీక్షించిన చిత్రాల వివరాలను విడుదల చేసింది. ఆ జాబితా ప్రకారం టాప్ 10 స్థానాల్లో హిందీ చిత్రాలు 9 స్థానాలను ఆక్రమించినా.. తమిళ చిత్రం మహారాజా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
Also Read
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
- Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
లిస్ట్‌లో ఉన్న ఏకైక దక్షిణ భారత భాషా చిత్రం కూడా అదే కావడం గమనార్హం. మహారాజాను 18.6 మిలియన్ల మంది వీక్షకులు వీక్షించారు. ఆ సినిమా తరువాత హిందీ సినిమా క్రూ ఉంది. ఈ చిత్రానికి 17.9 మిలియన్ వ్యూస్ వచ్చాయి. లపాటా లేడీస్, జ్యోతిక నటించిన షైతాన్, హృతిక్ రోషన్ యొక్క ఫైటర్ వరుసగా 3వ, 4వ, 5వ స్థానాల్లో ఉన్నాయి. రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన యానిమల్ ఆరో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో షారుఖ్ ఖాన్ డంకి 8వ స్థానంలో నిలిచింది. మహారాజా చిత్రానికి నితిలన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నటుడు విజయ్ సేతుపతికి 50వ చిత్రం. ఈ చిత్రం గత జూన్‌లో థియేటర్లలో విడుదలైంది. విజయ్ సేతుపతితో పాటు అనురాగ్ కశ్యప్, నటరాజ్, సింగంబులి, అభిరామి ఈ చిత్రంలో నటించారు. థియేటర్లలో రూ.100 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రికార్డు సృష్టించడంతో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేస్తోంది.
తాజావార్తలు
-
India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
-
Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Cupid Limited Share Price: కండోమ్‌లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
-
Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!