హమాస్‌కు కొత్త చీఫ్ వచ్చేశాడు. హమాస్ అధినేత హసన్ నస్రల్లా మరణం తర్వాత హమాస్‌కు కొత్త లీడర్ వస్తారా? లేదా? అన్న సందిగ్ధం నెలకొంది. సెప్టెంబర్ 27న ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడుల్లో హసన్ నస్రల్లా హత్యకు గురయ్యాడు. అప్పటి నుంచి అయోమయం చోటుచేసుకుంది. తొలుత నస్రల్లా వారసుడిగా బంధువు హషీమ్ సఫీద్దీన్‌ను ఎన్నుకోవాలని హిజ్బుల్లా భావించింది. కానీ అతడు కూడా తమ చేతుల్లో చనిపోయాడని ఐడీఎఫ్ వెల్లడించింది. ఇదిలా ఉంటే సీనియారిటీ ప్రకారం నస్రల్లా వారసుడిగా నయీం ఖాసిమ్ ముందు వరుసలో ఉన్నారు. కానీ నస్రల్లా మరణం తర్వాత ఇతడు ప్రాణభయంతో ఇరాన్ పారిపోయినట్లుగా వార్తలు వినిపించాయి. ఎట్టకేలకు నస్రల్లా వారసుడిగా నయీం ఖాసిమ్‌నే ఎన్నుకున్నట్లు మంగళవారం హిజ్బుల్లా ఒక ప్రకటనలో తెలిపింది.
సెక్రటరీ జనరల్ హసన్ నస్రల్లా స్థానంలో డిప్యూటీ హెడ్ నయీం ఖాసిమ్(71)ను ఎన్నుకున్నట్లు లెబనీస్ సాయుధ సమూహం హిజ్బుల్లా మంగళవారం పేర్కొంది. వ్రాతపూర్వకమైన ప్రకటనలో తెలిపింది. 1991లో డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా నయీం ఖాసిమ్ ఎన్నికయ్యారు. అలా హమాస్‌లో 30 ఏళ్లుగా సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. హిజ్బుల్లాలో అత్యంత ప్రభావంతమైన నాయకుల్లో ఒకరిగా గుర్తింపు ఉంది. అంతేకాదు మంచి వ్యూహకర్తగా కూడా పేరుంది. ఇక నస్రల్లా హత్య తర్వాత మూడు ప్రసంగాల ద్వారా ప్రజలను ఉత్తేజపరిచారు. ఒకటి బీరుట్ నుంచి, రెండు టెహ్రాన్ నుంచి ప్రసంగాలు చేశారు. అంతేకాదు కాల్పుల విరమణ ఒప్పందాలకు కూడా పలుమార్లు మద్దతు తెలిపారు. కానీ అవేమీ ఫలించలేదు.