NTV Telugu Site icon

Covid-19: కోవిడ్ తర్వాత తీవ్ర మానసిక క్షోభకు గురువుతున్న హెల్త్ వర్కర్స్.. అధ్యయనంలో వెల్లడి..

Corona Virus

Corona Virus

Covid-19: మూడేళ్లుగా కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. తన రూపాలను మార్చుకుంటూ ప్రపంచంపై దాడి చేస్తూనే ఉంది. ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్ ఇలా రకరకాల వేరియంట్లు ప్రజలపై దాడి చేస్తూనే ఉన్నాయి. కోరోనా వైరస్ పలు దేశాల వ్యాపారం, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపడమే కాకుండా ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తడిని కలిగించింది. ముఖ్యంగా కరోనా వేవ్ లు ముంచుకొచ్చిన సమయంలో వైద్యరంగం తీవ్ర ఇబ్బందులకు గురైంది. వైద్యులు, హెల్త్ వర్కర్లు తీవ్ర ఒత్తడిని ఎదుర్కొన్నారు.

Read Also: Mahesh Kumar Goud : ఇంత అవమానాన్ని గురైన గవర్నర్ ఇలా మాట్లాడుతుందని అనుకోలేదు

కోవిడ్ తర్వాత ఆరోగ్య కార్యకర్తలు తీవ్ర మానసిక క్షోభకు గురైనట్లు ఓ అధ్యయనంలో తేలింది. తైవాన్ కు చెందిన నేషనల్ చెంగ్ కుంగ్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఆగ్నేయాసియా ప్రజలపై కోవిడ్-19 మహమ్మారి మానసిక ప్రభావాన్ని అధ్యయనం చేశారు. దక్షిణాసియా లోని కొన్ని ప్రాంతాల్లోని ఆరోగ్య కార్యకర్తలు, ఔట్ పేషెంట్లు, సాధారణ జనాభాపై మహమ్మారి ప్రభావం, మానసిక ప్రభావాన్ని పరిశీలించారు. వైరస్ ను కట్టడి చేసేందుకు నిర్భంధంగా లాక్ డౌన్లు విధించడం ప్రజల జీవనశైలిని, సామాజిక ప్రవర్తనను ఎక్కువగా మార్చిందని కనుగొన్నారు. ముఖ్యంగా ఆరోగ్య కార్యకర్తలు మానసికంగా తీవ్రంగా ప్రభావితం అయ్యారని తేల్చింది.

తైవాన్ హెల్త్ వర్కర్లు, ఔట్ పేషెంట్లతో పాటు హాంకాంగ్ కు చెందిన సాధారణ ప్రజలపై అధ్యయనం చేశారు. ఈ పరిశోధనల్లో హెల్త్ వర్కర్లు మానసిక క్షోభకు గురవుతున్నట్లు గుర్తించారు. అయితే వీరు కోవిడ్ అంటే తక్కువ భయాన్ని కలిగి ఉన్నట్లు, హాంకాంగ్ కు చెందిన సాధారణ ప్రజలు కోవిడ్ మహమ్మారికి భయపడుతున్నట్లు గుర్తించారు.