Iran Ex President: ఇజ్రాయెల్‌పై నిఘా కోసం ఏర్పాటు చేసిన ఓ ఇంటెలిజెన్స్ అధిపతే చివరికి మమల్ని మోసం చేశాడని ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహముద్ అహ్మదిన్‌జాద్ పేర్కొన్నారు. అతడు మా సమాచారం మొత్తం ఇజ్రాయెల్‌కు చేరవేసేవాడని ఆరోపణలు చేశాడు. టెహ్రాన్‌లో మొస్సాద్ సంస్థ ఏ స్థాయిలో వెళ్లిందో తెలియజేస్తూ.. ఈ విషయాన్ని ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.
Read Also: Bullet Train Project: మోడీ కలల ప్రాజెక్ట్ “బుల్లెట్ రైలు”కు.. జపాన్ అడ్డంకి!
కాగా, మొస్సాద్ విజయవంతంగా మా ఇంటెలిజెన్స్ యూనిట్స్‌ను తన వైపునకు తిప్పుకుందని ఇరాన్ మాజీ అధ్యక్షుడు అహ్మదిన్‌జాద్ తెలిపారు. వీరిలో దాదాపు 20 మంది ఇంటెలిజెన్స్ సిబ్బంది డబుల్ ఏజెంట్లుగా మారి.. ఇజ్రాయెల్‌కు అత్యంత కీలకమైన అణు రహస్యాలను అందించారని పేర్కొన్నాడు. ఈ కామెంట్స్ తో ఇరాన్ భద్రత, నిఘా వ్యవస్థలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయాయి. మా నిఘా సంస్థకు చెందిన ఓ అధిపతే ఇజ్రాయెల్ గూఢచారని 2021లోనే బయటకు వచ్చింది. ఇరాన్‌లో టెల్‌అవీవ్ అత్యంత కఠిన ఆపరేషన్లు నిర్వహించి తేలిగ్గా కీలక సమాచారం చేజిక్కించుకొంటదని చెప్పుకొచ్చారు. ఇటీవల కాలంలో మొస్సాద్ కార్యకలాపాలు మరింత పెరిగిపోయాయని మహముద్ అహ్మదిన్‌జాద్ వెల్లడించారు.
Read Also: Chandrahass: సినిమా నచ్చకుంటే డబ్బు వాపస్… యాటిట్యూడ్ స్టార్ షాకింగ్ కామెంట్స్
ఇక, మొస్సాద్ ఓ ఆపరేషన్ చేసి దాదాపు 1,00,000 అణుపత్రాలను దొంగలించింది అని మహముద్ అహ్మదిన్‌జాద్ తెలియజేశాడు. వాటిని ఇజ్రాయెల్ ప్రధాని 2018లో బహిర్గతం చేశాడని చెప్పుకొచ్చాడు. ఇరాన్ ఏవిధంగా సీక్రెట్‌గా అణు కార్యక్రమాలను నిర్వహిస్తోంది అనేది అందులో స్పష్టంగా ఉందన్నారు. టెహ్రాన్‌లోని రహస్య స్థావరంలోకి మొస్సాద్ ఏజెంట్లు చొరబడి వాటిని ఎత్తుకెళ్లారని తెలిపారు. దాదాపు పాతిక మంది ఇందులో పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఇరాన్ అణు లక్ష్యాలను ఇది తీవ్రంగా దెబ్బ తీసింది అని ఇరాన్ మాజీ అధ్యక్షుడు ఆరోపించాడు.