Site icon NTV Telugu

Sydney Attack: ‘‘గర్ల్‌ఫ్రెండ్ కావాలనుకున్నాడు’’.. సిడ్నీ మాల్ అటాక్ నిందితుడి గురించి సంచలన విషయాలు..

Sydney

Sydney

Sydney Attack: ఆస్ట్రేలియా సిడ్నీ నగరంలోని ఓ మాల్‌లో దుండగులు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆ దేశాన్ని భయాందోళనకు గురిచేసింది. ఈ దాడిలో మొత్తం ఆరుగురు మరణించారు. చనిపోయిన వారిలో 9 నెలల పసికందు కూడా ఉంది. నిందితుడిని జోయెల్ కౌచీగా పోలీసులు గుర్తించారు. దాడి చేస్తున్న సమయంలో మహిళా ఇన్‌స్పెక్టర్ అమీ స్కాట్ కాల్చి చంపింది. ప్రస్తుతం ఈ మహిళా అధికారి వీరోచిత పోరాటాన్ని యావత్ ఆస్ట్రేలియా కీర్తిస్తోంది.

Read Also: Botsa Satyanarayana : స్టీల్ ప్లాంట్ మీద NDA స్టాండ్ ఏంటి..?

ఇదిలా ఉంటే, నిందితుడి తండ్రి అండ్రూ కౌచి సంచలన విషయాలు వెల్లడించారు. ఈ దాడితో తన గుండె పగిలిపోయిందని అన్నారు. తాను ఓ రాక్షసుడిని ప్రేమిస్తున్నానని కొడుకు గురించి చెప్పాడు. తన కొడుకు ఎందుకు ఈ దాడికా పాల్పడ్డాడనే విషయం తనకు ఖచ్చితంగా తెలియదని చెప్పాడు. నన్ను క్షమించాలని, చనిపోయిన వారిని తిరిగి తీసుకురావడానికి నేను ఏం చేయలేనని తన బాధను వ్యక్తీకరించారు. రద్దీగా ఉండే షాపింగ్ మాల్‌లో తొమ్మిది మందిపై దాడి చేసి ఆరుగురి మరణానికి కారణమైన నిందితుడు మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని పోలీసులు తెలిపారు.

తన కొడుకుకు రోగ నిర్ధారణ తర్వాత అతడికి సహాయం చేయడానికి తన శక్తి మేర అంతా చేశానని, తన కొడుకుకు సేవకుడిగా ఉన్నానని అతని తండ్రి చెప్పారు. ‘‘ అతను నా కొడుకు, నేను ఒక రాక్షసుడిని ప్రేమిస్తున్నాను, మీకు అతను రాక్షసుడు, నాకు అతను అనారోగ్యంతో ఉన్న బాలుడు’’ అని అతను చెప్పాడు. అయితే, దాడి సమయంలో అతను పురుషుల జోలికి వెళ్లలేదని తేలింది. ముఖ్యంగా మహిళల్ని టార్గెట్ చేసినట్లు అనుమానిస్తున్నారు. ‘‘అతను గర్ల్‌ఫ్రెండ్ కావాలనుకున్నాడు, అయితే అతనికి సోషల్ స్కిల్స్ లేక నిరాశకు గురయ్యాడు’’ అని అతని తండ్రి చెప్పుకొచ్చారు. వైస్ట్ ఫీల్డ్ షాపింగ్ కాంప్లెక్స్‌లో జరిగి మారణహోమ అరుదైన ఘటనగా అక్కడి పోలీసులు అభివర్ణించారు. ఈ దాడి ఉగ్రవాద చర్య కాదని పోలీసులు వెల్లడించారు.

Exit mobile version