NTV Telugu Site icon

Hilarious Plan: కోహినూర్ వజ్రం భారత్‌కు రావాలంటే ఇదే దారి..! పీఎం కిడ్నాప్‌ ప్లాన్‌ చేసిన వ్యాపారవేత్త..!

Harsh Goenka

Harsh Goenka

భారత్‌ సంపద కోహినూర్‌ డైమండ్ ఇప్పుడు యూకేలో ఉన్న విషయం తెలిసిందే.. కోహినూర్‌ను భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయనే వార్తలు అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం.. అయితే, ఇంత కాలం ఓ లెక్క.. ఇప్పుడు ఒక లెక్క అంటున్నారు. ఎందుకంటే.. భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఈ సమయంలోనే అది సాధ్యం అంటున్నారు. అయితే, బ్రిటన్‌ పీఎం రిషి సునాక్‌.. టీమిండియా మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రాకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని.. ఇప్పటికే సోషల్‌ మీడియాలో రచ్చ జరుగుతోంది.. ఇద్దరి ఫొటోలను షేర్‌ చేస్తూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.. రిషి సునాక్- నెహ్రా దాదాపుగా ఒకేలా ఉండటం.. హావభావాలు, ఒడ్డు పొడుగు ముఖ కవళికలు.. దాదాపు ఒకేలా ఉండటం.. ఇద్దరి వయస్సు కూడా దగ్గరగానే ఉన్నాయి.. అయితే, కోహినూర్‌ను భారత్‌కు తప్పించేందుకు ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా కిడ్నాప్‌ ప్లాన్‌ చేశారు..

Read Also: Elon Musk: ఎలాన్‌ మస్క్‌ ఇక ట్విట్టర్‌ చీఫ్‌..! ఆఫీసులోకి ఇలా ఎంట్రీ ఇచ్చాడేంటి..

వ్యాపారవేత్త హర్ష గోయెంకా కిడ్నాప్‌ ప్లాన్‌ చేయడం ఏంటి? ఎవరిని కిడ్నాప్‌ చేస్తే కోహినూర్‌ వజ్రం భారత్‌కు వస్తుంది.. అనే విషయాల్లోకి వెళ్తే.. యూకే ప్రధాని రిషి సునాక్‌ను మొదట భారత్‌కు రప్పించాలి.. బెంగళూరులో తన మామగారైన (ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి) కుటుంబాన్ని చూసేందుకు వచ్చి ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు.. ఆయన్ను కిడ్నాప్‌ చేయాలని.. అప్పుడు బ్రిటన్‌ ప్రధానిగా రిషి సునాక్ స్థానంలో ఆశిష్ నెహ్రాను పంపాలన్నారు.. ఆ తేడా ఎవరూ గమనించలేరు.. కోహినూర్‌ వజ్రాన్ని వెనక్కి రప్పించే బిల్లును వెంటనే ఆమోదించమని నెహ్రాకు సూచించాలని.. అలా కోహినూర్‌ వజ్రం భారత్‌కు తీసుకురావొచ్చు అనే కోణంలో ఎమోజీలను షేర్‌ చేశారు హర్ష గోయెంకా.. మొత్తంగా.. ఆయన చేసిన ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది..

కోహినూర్‌ను తిరిగి పొందాలని నా స్నేహితుడి ఆలోచన అంటూ వరుసగా నాలుగు పాయింట్లను సూచించారు
1. రిషి సునాక్‌ని భారతదేశానికి ఆహ్వానించండి..
2. అతను తన అత్తమామల కోసం బెంగళూరు ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు అతన్ని కిడ్నాప్ చేయండి.
3. బదులుగా ఆశిష్ నెహ్రాను యూకే ప్రధానిగా పంపండి. దానిని ఎవరూ గ్రహించలేరు.
4. కోహినూర్‌ను తిరిగి ఇచ్చే బిల్లును పాస్ చేయమని నెహ్రాకు చెబుతారు. అంటూ పాయింట్లు రాసుకొచ్చారు.