NTV Telugu Site icon

US: ముందంజలో దూసుకెళ్తోన్న కమలా హారిస్.. ఎన్ని విరాళాలు సేకరించారంటే..!

Ustramp

Ustramp

ఏడాది చివరిలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్ష రేసులో డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ పోటీ పడుతున్నారు. ఇద్దరి మధ్య ఫైటింగ్ పోటాపోటీగా ఉంది. నువ్వానేనా? అన్నట్లుగా వార్ నడుస్తోంది. ఇక కమలా హారిస్ ప్రచారంలో ముందంజలో దూసుకుపోతున్నారు. ట్రంప్‌పై పైచేయి సాధిస్తూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే ఆగస్టులో ట్రంప్‌ కంటే ఎక్కువగా విరాళాలు సేకరించి రికార్డు సృష్టించారు. కమలా హారీస్‌ ఆగస్టులో 30 లక్షల మంది దాతల నుంచి 36.1 కోట్ల డాలర్ల విరాళాలను సేకరించారు. ఇక సెప్టెంబర్‌లో న్యూయార్క్‌, అట్లాంటా, లాస్‌ ఏంజిల్స్‌, శాన్‌ ఫ్రాన్సిస్కోలలో పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు హారిస్‌ బృందం ఏర్పాట్లు చేస్తోంది.

ఇది కూడా చదవండి: Balakrishhna: ఇది కదా మెంటల్ మాస్ అంటే.. బాలయ్యకు విలన్‌గా కుర్ర హీరో?

ట్రంప్‌ మాత్రం కొంత వెనుకంజలో ఉన్నారు. ట్రంప్‌ ఆగస్టులో కేవలం 13 కోట్ల డాలర్లను మాత్రమే సేకరించినట్లు ఆయన బృందం వెల్లడించింది. ఈ ‍క్రమంలో ట్రంప్‌ కంటే కమలకు.. దాదాపు మూడు రెట్లు ఎక్కువ విరాళాలు వచ్చాయి. ఇక డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత కమలా హారీస్‌ పూర్తి స్థాయి ప్రచారాన్ని మొదలుపెట్టారు. నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా డెమోక్రటిక్‌, రిపబ్లికన్‌ పార్టీలు ముమ్మర ప్రచారం చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy: రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు

Show comments